- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
FPIs: వెళ్లిపోతున్న విదేశీ నిధులు
డిపాజిటరీ డేటా ప్రకారం, సెప్టెంబర్ మొదటి వారంలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐ రూ. 12,257 కోట్ల విలువైన నిధులను ఉపసంహరించుకున్నారు

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ స్టాక్ మార్కెట్లలో గత కొంతకాలంగా ప్రతికూల సెంటిమెంట్ కొనసాగుతోంది. ఫలితంగా మన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీగా నిధులను వెనక్కి తీసుకెళ్తున్నారు. డిపాజిటరీ డేటా ప్రకారం, సెప్టెంబర్ మొదటి వారంలో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ. 12,257 కోట్ల విలువైన నిధులను ఉపసంహరించుకున్నారు. ఇందుకు ప్రధానంగా భారత్‌పై అమెరికా విధిస్తున్న సుంకాలు, డాలర్ మారకం బలంగా ఉండటం, కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు కారణాలుగా ఉన్నాయి. గత నెలలో ఎఫ్‌పీఐలు రూ. 34,990 కోట్లను, అంతకుముందు జూలైలో రూ. 17,700 కోట్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 2025లో ఇప్పటివరకు మొత్తం రూ. 1.43 లక్షల కోట్ల విదేశీ నిధులు మన ఈక్విటీల నుంచి వెళ్లాయని డిపాజిటరీ డేటా పేర్కొంది. రానున్న వారంలోనూ అమెరికా ఫెడ్ రేట్ల కోతపై వస్తున్న ఊహాగానలు, అమెరికా లేబర్ డేటా, ఆర్‌బీఐ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు, భారత రూపాయి మారకం వంటి అంశాలు ఎఫ్‌పీఐల నిధుల ఉపసంహరణపై ప్రభావితం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జీఎస్టీ సంస్కరణల కారణంగా వ్యవస్థలో గిరాకీ పుంజుకుంటుందని, ప్రభుత్వం ఆదాయం మెరుగుపడుతుందనే అంచనాలున్నాయి. దీనికితోడు విధానపరమైన సంస్కరణలు ఎఫ్‌పీఐలను తిరిగి ఈక్విటీల్లో పెట్టుబడులను ఆకర్షించవచ్చని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ వెల్లడించారు.






