FPIs: ఒక్క మార్చిలోనే రూ. 93 వేల కోట్ల ఎఫ్‌పీఐలు వెనక్కి

by S Gopi |

స్టాక్ మార్కెట్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) షేర్ల అమ్మకాలు ఈ నెలలో రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.

FPIs: ఒక్క మార్చిలోనే రూ. 93 వేల కోట్ల ఎఫ్‌పీఐలు వెనక్కి
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత కరెన్సీ రూపాయి క్రమం తప్పకుండా రికార్డు స్థాయి కనిష్టాలకు బలహీనపడుతుండటం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో మన ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీగా నిధులు వెనక్కి తీసుకెళ్తున్నారు. వీటితో పాటు పెరుగుతున్న ముడిచమురు ధరలు దేశ మౌలిక సదుపాయాలకు ముప్పుగా పరిణమించాయి. దీని ఫలితంగా స్టాక్ మార్కెట్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) షేర్ల అమ్మకాలు ఈ నెలలో రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎన్ఎస్‌డీఎల్, బీఎస్ఈ సంయుక్త డేటా ప్రకారం, ఈ నెలలో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు కేవలం స్టాక్ మార్కెట్ల నుంచే రూ. 93,698 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఎన్ఎస్‌డీఎల్ ప్రకారం, ఇది 2024, అక్టోబర్‌లో నమోదైన రూ. 94,017 కోట్లకు అత్యంత చేరువగా ఉంది. దీంతో 2026లో మొత్తం ఎఫ్‌పీఐ నిధుల ఉపసంహరణ దాదాపు రూ. 1.10 లక్ష కోట్ల మార్కును అధిగమించింది. ఫిబ్రవరిలో 17 నెలల గరిష్ట స్థాయి అయిన రూ. 22,615 కోట్ల భారీ నిధుల ప్రవాహం నమోదైన తర్వాత, పెట్టుబడిదారుల సెంటిమెంట్‌లో వచ్చిన తీవ్రమైన మార్పును ఇది స్పష్టంగా తెలియజేస్తోందని మార్కెట్ విశేషకులు పేర్కొన్నారు.

Next Story