- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPOs: నెలాఖరులో ఐపీఓల సందడి
మొత్తం నాలుగు కంపెనీలు ఐపీఓ బిడ్డింగ్ ప్రారంభించనుండగా, రూ.6,600 కోట్ల కంటే ఎక్కువ నిధులను సమీకరించనున్నాయి

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది స్టాక్ మార్కెట్లలో చాలా ఆలస్యంగా ఐపీఓల సందడి మొదలైంది. భౌగోళిక రాజకీయ పరిణామాలు, వాణిజ్య సవాళ్ల మధ్య ఇప్పటివరకు 12 కంపెనీలు మాత్రమే ఐపీఓకు వచ్చాయి. అయితే, ఇటీవల మారిన పరిస్థితుల మధ్య వచ్చే వారం రోజుల్లో పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)ల కోసం కంపెనీలు క్యూ కట్టాయి. వాటిలో లీలా ప్యాలెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, ఏజీస్ వొపాక్ టెర్మినల్స్ వంటి ప్రధాన కంపెనీలున్నాయి. మొత్తం నాలుగు కంపెనీలు ఐపీఓ బిడ్డింగ్ ప్రారంభించనుండగా, రూ.6,600 కోట్ల కంటే ఎక్కువ నిధులను సమీకరించనున్నాయి. ప్రపంచ మార్కెట్ పరిణామాలు, దేశీయంగా ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంట్, కనిష్టాల తర్వాత మార్కెట్లు ర్యాలీ అవుతున్న తరుణంలో కంపెనీలు ఐపీఓ ద్వారా నిధుల సేకరణకు అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి. ఐపీఓ బిడ్డింగ్ ప్రారంభించే కంపెనీలే కాకుండా బొరానా వీవ్స్, బెల్‌రైజ్ ఇండస్ట్రీస్ కంపెనీలు 28-29 తేదీల్లో లిస్టింగ్ కానున్నాయి.
2024లో మొత్తం 91 ఐపీఓలు మార్కెట్లలో అడుగు పెట్టగా, మొత్తం రూ. 1.6 లక్షల కోట్ల విలువైన నిధులను కంపెనీలు సేకరించాయి. రిటైల్ ఇన్వెస్టర్ల ఉత్సాహం, ఆర్థికవ్యవస్థ వృద్ధి స్థిరంగా ఉండటం, ప్రైవేట్ పెట్టుబడులు ఇందుకు దోహదపడ్డాయి. ఇక, ఈ వారంలో ఐపీఓకు సిద్ధమైన కంపెనీల్లో లీలా ప్యాలెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ నిర్వహించే స్క్లాస్ బెంగళూరు లిమిటెడ్ రూ. 3,500 కోట్ల నిధుల కోసం సిద్ధమవుతోంది. ఇందులో ఈక్విటీ షేర్ల నుంచి రూ. 2,500 కోట్లు, రూ. 1,000 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా సమీకరించనుంది. మే 26-28 మధ్య మార్కెట్లలో అడుగుపెట్టనున కంపెనీ ఒక్కో షేర్‌కు రూ. 413-435గా నిర్ణయించింది. దీని తర్వాత రూ. 2,800 కోట్ల కోసం ఏజీస్ లాజిస్టిక్స్ కంపెనీ, మే 28న ముగియనున్న ఐపీఓ ప్రక్రియ కోసం ఒక్కో షేర్‌ను రూ. 223-235 ధర నిర్ణయించింది. స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యూబ్‌లు, పైపుల తయారీ కంపెనీ స్కోడా ట్యూబ్స్ మే 28-30 మధ్య రూ.220 కోట్ల వరకు మొత్తం ఈక్విటీ షేర్ల విక్రయం ద్వారా నిధులు సేకరించనుంది. ఒక్కో షేర్‌కు రూ. 130-140 ధరను నిర్ణయించింది. చివరగా, ఇంటిగ్రేటెడ్ పవర్ సొల్యూషన్ కంపెనీ ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ రూ. 168 కోట్ల కోసం మే 27-29 మధ్య సబ్‌స్క్రిప్షన్ ప్రారంభిస్తుంది. కంపెనీ ఒక్కో షేరుకు రూ. 95-105 ధరను నిర్ణయించింది.






