- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI: భారీగా పెరిగిన ఫారెక్స్ నిల్వలు
ఏప్రిల్ 17తో ముగిసిన వారంలో భారత విదేశీ మారకపు నిల్వలు 2.36 బిలియన్ డాలర్లు పెరిగాయి. దీంతో ఫారెక్స్ కిట్టీ 703.30 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: భౌగోళిక రాకకీయ ఉద్రిక్తతల మధ్య బలహీనపడిన ఫారెక్స్ నిల్వలు భారీగా పుంజుకున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 17తో ముగిసిన వారంలో భారత విదేశీ మారకపు నిల్వలు 2.36 బిలియన్ డాలర్లు పెరిగాయి. దీంతో ఫారెక్స్ కిట్టీ 703.30 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత వారం, విదేశీ మారక నిల్వల మొత్తం 700.946 బిలియన్ డాలర్లకు చేరాయి. కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి భారత రూపాయిపై ఒత్తిడి కలిగిస్తున్నాయి. దీంతో ఆర్‌బీఐ విదేశీ మారక మార్కెట్లో డాలర్లను విక్రయించడం ద్వారా జోక్యం చేసుకుంది. ఈ కారణంగానే మారకపు నిల్వలు మెరుగుపడ్డాయి. సమీక్షించిన వారంలో కీలక విదేశీ కరెన్సీ ఆస్తులు 1.48 బిలియన్ డాలర్లు పెరిగి 557.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అలాగే, బంగారం నిల్వల విలువ 790 మిలియన్ డాలర్లు పెరిగి, 122.13 బిలియన్ డాలర్లకు, ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు (ఎస్‌డీఆర్) 78 మిలియన్ డాలర్లు పెరిగి, 18.841 బిలియన్ డాలర్లకు చేరాయి. ఐఎంఎఫ్ వద్ద భారత నిల్వలు 14 మిలియన్ డాలర్లు పెరిగి, 4.87 బిలియన్ డాలర్లకు చేరినట్టు ఆర్‌బీఐ పేర్కొంది.






