Stock Market: స్టాక్ మార్కెట్ల నుంచి రూ. 1.6 లక్షల కోట్ల నిధులు తీసుకెళ్లిన ఎఫ్‌పీఐలు

by S Gopi |

ఇదే సమయంలో అమెరికా మార్కెట్ల నుంచి ఎక్కువ రాబడి ఉండటంతో నిధులను తరలించారు

Stock Market: స్టాక్ మార్కెట్ల నుంచి రూ. 1.6 లక్షల కోట్ల నిధులు తీసుకెళ్లిన ఎఫ్‌పీఐలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి రికార్డు స్థాయిలో నిధులు ఉపసంహరించుకున్నారు. భారత కరెన్సీ రూపాయితో పాటు ఇతర కరెన్సీలూ అస్థిరంగా ఉండటం, ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా విధించిన అధిక సుంకాలు, అధిక వాల్యూయేషన్ల కారణంగా మదుపర్లు రిస్క్‌ను తగ్గించుకోవడంతో రికార్డు స్థాయిలో రూ. 1.6 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్నారు. ఇదే సమయంలో అమెరికా మార్కెట్ల నుంచి ఎక్కువ రాబడి ఉండటంతో నిధులను తరలించారు. కొందరు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) స్టాక్ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్న నిధులను బాండ్లు వంటి సురక్షితమైన సాధనాల్లో పెట్టుబడిగా పెట్టారని, అలాగే ఇప్పటివరకు రూ. 59,000 కోట్లను డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. ఈ ధోరణి కారణంగా 2025 ఏడాది ఇప్పటివరకు అత్యధికంగా ఎఫ్‌పీఐలు ఎక్కువ నిధులు ఉపసంహరించుకున్న ఏడాదిగా నిలిచింది. ఇదివరకు 2022లో రికార్డు స్థాయి రూ. 1.21 లక్షల కోట్ల విలువైన నిధులను వెనక్కి తీసుకున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు నిధులను వెనక్కి తీసుకెళ్లినప్పటికీ దేశీయ మదుపర్ల కొనుగోళ్ల కారణంగా మన స్టాక్ మార్కెట్లపై ఒత్తిడి తగ్గిందని విశ్లేషకులు వెల్లడించారు.

Next Story