- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Forbes Billionaires List 2025: ఫోర్బ్స్ సంపన్నుల జాబితా విడుదల.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే?
ఫోర్బ్స్ (Forbes) సంస్థ తాజాగా ఈ ఏడాది బిలియనీర్ల జాబితాను (Forbes Billionaires List 2025) విడుదల చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఫోర్బ్స్ (Forbes) సంస్థ తాజాగా ఈ ఏడాది బిలియనీర్ల జాబితాను (Forbes Billionaires List 2025) విడుదల చేసింది. ఇక ఈ జాబితాలో టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. 342 బిలియన్ డాలర్ల నికర విలువతో మస్క్ తొలిస్థానం దక్కించుకోగా, గతేడాదితో పోలిస్తే ఆయన సంపద 147 బిలియన్ డాలర్లు పెరిగినట్లు తెలుస్తోంది. 216 బిలియన్ డాలర్ల నికర విలువతో రెండో స్థానంలో ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ బుకర్‌బర్గ్ నిలిచారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 215 బిలియన్ డాలర్ల నికర విలువతో మూడో స్థానంలో ఉన్నారు.
ఇక ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) 92.5 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో 18వ స్థానంలో నిలిచారు. మరో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) 56.3 బిలియన్ డాలర్ల సంపదతో 28వ స్థానంలో ఉన్నారు. ఆసియాలో అత్యంత ధనవంతుడైన నాలుగో వ్యక్తి, దేశంలో అత్యంత ధనవంతుడైన రెండో వ్యక్తిగా అదానీ నిలిచారు.
అలాగే, ప్రస్తుతం యూఎస్ (US) 902 మంది సంపన్నులతో బిలియనీర్ హబ్‌గా కొనసాగుతోంది. చైనాలో 516 మంది బిలియనీర్లు ఉండగా.. భారత్‌లో 205మంది ఉన్నారు. ఇక ఈసారి 288 మంది కొత్త వ్యక్తులు ఫోర్బ్స్ జాబితాలో చేరారు. వీరిలో పలువురు హాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.






