- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Zomato: జొమాటోకు దెబ్బ మీద దెబ్బ..3 రోజుల్లో ఎన్ని వేల కోట్ల నష్టమో తెలుసా? ఇన్వెస్టర్లకు పీడకలలు
Zomato Q3 Results: భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఈ మధ్య కాలంలో తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతూ భారీగా పడిపోతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: Zomato Q3 Results: భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఈ మధ్య కాలంలో తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతూ భారీగా పడిపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మరీ ఎక్కువైంది. ఈ క్రమంలో పెద్ద పెద్ద కంపెనీల స్టాక్స్ పడిపోతున్నాయి. ఇందులోనే ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కూడా ఉంది. ఈ స్టాక్ వరుస సెషన్లలోనూ భారీగా పడిపోతూ వస్తోంది.
Zomato Share Price: దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతిపెద్ద ఐపీఓల్లో ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఒకటి. దీని గురించి కూడా కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. దీనికి అప్పట్లో మంచి డిమాండ్ వచ్చింది. ఇష్యూ ధర రూ. 76గా ఉంటే..ఏకంగా 50శాతానికిపైగా ప్రీమియంతో లిస్టయి ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించింది. ఆ తర్వాత అంత హైప్ లేకపోవడంతో స్టాక్ పడిపోతూ కనిష్టానికి చేరుకుంది. కొన్నాళ్లు ఇలాగే గడిచింది. అయితే మళ్లీ గతేడాది భారీగా పుంజుకుంది. మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందిస్తూ 2024 డిసెంబర్ నెలలో ఏకంగా రూ. 304.70దగ్గర ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఇష్యూ ధర దగ్గర నుంచి చూస్తే ఇది ఏకంగా 4 రెట్లకుపైగానే రిటర్న్స్ అందించింది. ఇక జొమాటోకు అన్నీ మంచిరోజులే అనుకుంటున్న సమయంలో సీన్ కాస్త రివర్స్ అయ్యింది.
2024 డిసెంబర్ 31న ఈ స్టాక్ ధర ఎన్ఎస్ఈలో రూ. 278.05 దగ్గర ముగిసింది. ఆ తర్వాత జనవరి 22 సెషన్లో ఈ స్టాక్ ధర ఒక దశలో ఇంట్రాడేలో రూ. 203.85 తాకింది. చివరకు ఆఖర్లో స్వల్పంగా పుంజుకుని రూ. 218. 10 వద్ద స్థిరపడింది. అంటే ఈ 20 రోజుల గ్యాప్ లో స్టాక్ 25శాతానికిపైగా పడిపోయింది. ఆల్ టైమ్ హై నుంచి చూస్తే 33 శాతం దిగివచ్చింది.
బుధవారం రోజు ఇంట్రాడే కనిష్టంతో చూసుకుంటే గత మూడు సెషన్లలోనే జొమాటో స్టాక్ 18శాతానికి పైగా పడిపోయింది. 2024-25 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ ఫలితాలు వచ్చిన తర్వాతే ఈ స్టాక్ ఇలా భారీగా పడిపోయింది. కంపెనీలాభాలు రూ. 138కోట్ల నుంచి రూ. 59 కోట్లకు పడిపోవడం..మార్కెట్ అంచనాలను అందుకోలేకపోవడం..తన క్విక్ కామర్స్ యూనిట్ బ్లింకిట్ లో నష్టాలను పెరుగుతుండటం వంటి వ్రుద్ధిపై ఆందోళనలు రేకెత్తిస్తున్న అంశాలు అవ్వగా..ఇన్వెస్టర్లు ఈ షేర్లను అమ్మేస్తున్నారు. దీంతో స్టాక్ పతనం మొదలైంది.
మూడు సెషన్ల వ్యవధిలో కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ. 44, 620కోట్ల మేర తగ్గింది. మొత్తంలో ఈ స్టాక్ ద్వారా ఇన్వెస్టర్లు నష్టపోయారు. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ. 1.95 లక్షల కోట్లు ఉంది. నష్టాలు వస్తున్నా బ్లింకిట్ స్టోర్ల సంఖ్య పెంచుతూ పోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ మిశ్రమ ఫలితాల నేపథ్యంలో పలు అంతర్జాతీయ బ్రోకరేజీలు జొమాటో ధరను కూడా తగ్గించేశాయి. ప్రస్తుతం జొమాటోకు మంచి రోజులు లేనట్లే అని చెప్పవచ్చు.






