- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
FMCG: జీఎస్టీ సంస్కరణల ఎఫెక్ట్.. ధరలు తగ్గించిన ఎఫ్ఎంసీజీ కంపెనీలు
వాటిలో సబ్బులు, షాంపూ, బేబీ డైపర్లు, టూత్‌పేస్ట్, రేజర్లు, ఆఫ్టర్-షేవ్ లోషన్లు వంటి సాధారణ ఉత్పత్తులు ఉన్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో సామాన్యులు వాడే అనేక రోజువారీ వస్తువుల ధరలను ఎఫ్ఎంసీజీ కంపెనీలు తగ్గించాయి. ఈ మేరకు గురువారం కొత్త ధరల వివరాలను ప్రకటించాయి. వాటిలో సబ్బులు, షాంపూ, బేబీ డైపర్లు, టూత్‌పేస్ట్, రేజర్లు, ఆఫ్టర్-షేవ్ లోషన్లు వంటి సాధారణ ఉత్పత్తులు ఉన్నాయి. సవరించిన ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమలు చేస్తామని కంపెనీ వెల్లడించాయి. ధరల వివరాలు వెల్లడించిన కంపెనీల్లో ప్రాక్టర్ అండ్ గాంబుల్(పీఅండ్‌జీ), ఇమామి, హెచ్‌యూఎల్ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. పీఅండ్‌జీ తన పోర్ట్‌ఫోలియోలోని విక్స్ యాక్షన్ 500 అడ్వాన్స్ ధరను రూ. 69 నుంచి రూ. 64కి(జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి) తగ్గించింది. హెడ్అండ్‌షోల్డర్ కూల్ మెంథాల్(300 ఎంఎల్) ధరను రూ. 360 నుంచి రూ. 320కి, స్మూత్ అండ్ సిల్కీ (72ఎంఎల్) ధరను రూ.89 నుంచి రూ.79కి, ప్యాంటీన్ షాంపూ హెయిర్ ఫాల్ కంట్రోల్, పాంటీన్ షాంపూ డీప్ రిపేర్ (340ఎంఎల్) ధరను రూ.410 నుంచి రూ.355కి, ప్యాంపర్స్(డైపర్లు), జిల్లేట్ షేవింగ్ క్రీమ్ రెగ్యులర్ (30 గ్రాములు) ధర రూ.45 నుంచి రూ.40కి, జిల్లెట్ షేవింగ్ బ్రష్ రూ.85 నుంచి రూ.75కి తగ్గించింది. ఓరల్-బి ఎవ్రీడే కేర్ టూత్ బ్రష్ ధర రూ.35 నుంచి రూ.30కి తగ్గించింది.
మరో ఎఫ్ఎంసీజీ కంపెనీ ఇమామి తన బోరోప్లస్ యాంటిసెప్టిక్ క్రీమ్ (80 మి.లీ) ధరలను రూ.165 నుంచి రూ.155కి, నవరత్న ఆయుర్వేద ఆయిల్ కూల్ (180 మి.లీ) ధరలను రూ.155 నుంచి రూ.145కి తగ్గిస్తోంది. డెర్మీకూల్ ప్రిక్లీ హీట్ పౌడర్ మెంథాల్ రెగ్యులర్ (150 గ్రాములు) ధర రూ.159 నుంచి రూ.149కి తగ్గనుంది. అదేవిధంగా, కేష్ కింగ్ గోల్డ్ ఆయుర్వేదిక్ ఆయిల్ (100 మి.లీ) ధర రూ.190 నుంచి రూ.178కి, జండు బామ్ (25 మి.లీ) ధర రూ.125 నుంచి రూ.118కి, జండు సోనా చండీ చ్యవాన్‌ప్లస్ (900 గ్రాములు) ధరలను కూడా రూ.385 నుంచి రూ.361కి తగ్గించింది. సబ్బుల్లో, ఇమామి బోరోప్లస్ యాంటిసెప్టిక్ మాయిశ్చరైజింగ్ శాండల్ సోప్ (125 గ్రాముల 6 సబ్బుల ప్యాక్) ధరలను రూ.384 నుంచి రూ.342కి తగ్గించింది.
దిగ్గజ హెచ్‌యూఎల్ కూడా డవ్ హెయిర్ ఫాల్ షాంపూ (340 మి.లీ) ధరను రూ.490 నుంచి రూ.435కి, డవ్ సీరం బార్ (75 గ్రాములు) ధరను రూ.45 నుంచి రూ.40కి తగ్గించింది. క్లినిక్ ప్లస్ స్ట్రాంగ్ అండ్ లాంగ్ షాంపూ (355 మి.లీ) ధర రూ.393 నుంచి రూ.340కి, సన్‌సిల్క్ బ్లాక్ షైన్ షాంపూ (350 మి.లీ) ధర రూ.430 నుంచి రూ.370కి తగ్గించింది. సబ్బులలో, లైఫ్‌బాయ్ (75 గ్రాముల 4 సబ్బుల ప్యాక్) ధర రూ.68 నుంచి రూ.60కి, లక్స్ రేడియంట్ గ్లో సోప్ (75 గ్రాముల 4 సబ్బుల ప్యాక్) ధర రూ.96 నుంచి రూ.85కి తగ్గింది. క్లోజప్ టూత్‌పేస్ట్ (150 గ్రాములు) ధర రూ.145 నుంచి 129కి తగ్గింది.
హెల్త్ డ్రింక్ కేటగిరీలో హార్లిక్స్ చాక్లెట్ (200 గ్రాములు) ధర రూ.130 నుంచి రూ.110కి, బూస్ట్ (200గ్రా.) ధర రూ.124 నుంచి రూ.110కి తగ్గింది. కిస్సాన్ కెచప్ (850 గ్రాములు) ధరలను రూ.100 నుంచి రూ.93కి, కిస్సాన్ జామ్ (200 గ్రాములు) ధరలను రూ.90 నుంచి రూ.80కి తగ్గించింది. బ్రూ కాఫీ (75 గ్రాములు) ధర రూ.300 నుంచి రూ.270కి తగ్గింది.






