Nirmala Sitaraman: దేశ ఆర్థిక రంగంలో యూనిఫైడ్ కేవైసీ అవసరం

by S Gopi |

ప్రస్తుత కేవైసీ విధానం వేర్వేరుగా ఉండటంతో వినియోగదారులకు అసౌకర్యం కలుగుతోంది.

Nirmala Sitaraman: దేశ ఆర్థిక రంగంలో యూనిఫైడ్ కేవైసీ అవసరం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ ఆర్థిక రంగంలో యూనిఫైడ్ కేవైసీ వ్యవస్థను తీసుకురావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఈ ప్రయత్నానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నాయకత్వం వహించాలని ఆమె కోరారు. శనివారం జరిగిన సెబీ 38వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రస్తుతం బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్లు వంటి ప్లాట్‌ఫారమ్‌లలో వినియోగదారులు మళ్లీ మళ్లీ కేవైసీ చేయాల్సి వస్తోందని, ఈ ఇబ్బందిని తగ్గించేందుకు ఒకే విధానం అవసరమని తెలిపారు. అన్ని చోట్ల ఒకే కేవైసీ ఉండాలని తెలిపారు. ప్రస్తుత కేవైసీ విధానం వేర్వేరుగా ఉండటంతో వినియోగదారులకు అసౌకర్యం కలుగుతోంది. అందుకే, డిజిటల్ టెక్నాలజీ సహాయంతో సురక్షితమైన, సులభమైన, ఎక్కడైనా ఉపయోగించగల కేవైసీ వ్యవస్థ అవసరమని అన్నారు. ఇది అమలైతే ప్రజలకు ఆర్థిక సేవలు మరింత సులభం అవుతాయని పేర్కొన్నారు.

Next Story