Flipkart IPO: వచ్చే ఏడాది ఐపీఓకు వచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్ సన్నాహాలు..!

by Maddikunta Saikiran |
Flipkart IPO: వచ్చే ఏడాది ఐపీఓకు వచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్ సన్నాహాలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్(Flipkart) దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market)లో ఎంట్రీకి సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది చివరి నాటికి ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్(IPO)కు వచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్ సన్నాహాలు మొదలుపెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ తన హోల్డింగ్ కంపెనీని సింగపూర్(Singapore) నుంచి భారత్‌(India)కు మార్చడానికి చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అంతర్గతంగా ఈ మార్పు కోసం ఆమోదం కూడా పొందిందని సమాచారం. స్విగ్గీ(Swiggy), జొమాటో(Zomato) వంటి సంస్థలు ఇదివరకే స్టాక్ ఎక్స్చేంజిల్లో లిస్ట్ అయ్యాయి. వచ్చే సంవత్సరం ఫ్లిప్‌కార్ట్ కూడా వాటి సరసన చేరనుంది.

కాగా ఫ్లిప్‌కార్ట్ సంస్థను 2007లో ఐఐటీ-దిల్లీ(IIT-Delhi) విద్యార్థులైన సచిన్ బన్సల్(Sachin Bansal), బిన్నీ బన్సల్(Binny Bansal) స్థాపించారు. ఒక చిన్న స్టార్టప్‌ కంపెనీగా ప్రారంభమై ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా ఎదిగింది. అయితే దీన్ని 2018లో అమెరికా(America)కు చెందిన రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్(Walmart) కొనుగోలు చేసింది. ఆ సంస్థకు ఫ్లిప్‌కార్ట్ లో 81% వాటా ఉంది. కాగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.17,907 కోట్ల ఆదాయం నమోదు చేసిన ఫ్లిప్‌కార్ట్, రూ.2,358 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సీఈఓగా కళ్యాణ్ కృష్ణమూర్తి(Kalyan Krishnamurthy) వ్యవరిస్తున్నారు.

Advertisement

Next Story