- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Flipkart: ఫ్లిప్‌కార్ట్ నేరుగా రుణాలు ఇవ్వడానికి ఆర్‌బీఐ అనుమతి
ఓ ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌కు నాన్-బ్యాంకేతర ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) లైసెన్స్ మంజూరు చేయడం ఇదే మొదటిసారి.

దిశ, బిజినెస్ బ్యూరో: వాల్‌మార్ట్ గ్రూప్‌లో భాగమైన ఫ్లిప్‌కార్ట్ భారతీయర్ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నుంచి విజయవంతంగా లోన్ లైసెన్స్‌ను పొందింది. దీని ద్వారా ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫామ్ నుంచి కస్టమర్‌లు, విక్రేతలకు నేరుగా రుణాలు అందించడానికి వీలవుతుంది. దీంతో భారత్‌లోని ఓ ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌కు నాన్-బ్యాంకేతర ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) లైసెన్స్ మంజూరు చేయడం ఇదే మొదటిసారి. దీంతో ఆర్థిక సేవల రంగంలో ఇదొక కీలకమైన చర్య అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ లైసెన్స్ ద్వారా డిపాజిట్‌లను స్వీకరించే సామర్థ్యం లేకపోయినా రుణాలు ఇచ్చే వెసులుబాటు ఫ్లిప్‌కార్ట్‌కు లభిస్తుంది. ప్లాట్‌ఫామ్ ద్వారా నేరుగా ఆర్థిక పరిష్కారాలకు మార్గం సుగమం చేస్తుంది. ఆర్‌బీఐ నుంచి లభించిన అనుమతులతో ఫ్లిప్‌కార్ట్ కంపెనీ తనకున్న సబ్‌స్క్రైబర్ బేస్ ద్వారా ఆర్థిక ఉత్పత్తులను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని ద్వారా దేశంలోని ఇ-కామర్స్ వ్యాపార దృక్పథాన్ని మార్చగలమని కంపెనీ భావిస్తోంది.
ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌తో సహా చాలా ఇ-కామర్స్ కంపెనీలు యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ వంటి బ్యాంకులతో భాగస్వామ్యం ద్వారా వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. అయితే, ఈ కొత్త లైసెన్స్ ఫ్లిప్‌కార్ట్ ప్రత్యక్షంగా రుణాలిచ్చేందుకు వీలవుతుంది. ఫ్లిప్‌కార్ట్ తన ఇ-కామర్స్ సైట్‌తో పాటు ఫిన్‌టెక్ అప్లికేషన్, సూపర్.మనీ ద్వారా నేరుగా రుణాలను అందించాలని, విక్రేతలకు ఫైనాన్సింగ్ అవకాశాలు కూడా పెరుగుతాయని ఆశిస్తోంది. లోన్లు ఇచ్చే ప్రక్రియ మరికొన్ని నెలల్లోనే ప్రారంభతుంది.






