- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Flipkart: ఉద్యోగులందరూ ఐదు రోజులు ఆఫీసుకు రావాలన్న ఫ్లిప్‌కార్ట్
ఈ ప్రక్రియను దశలవారీగా చేపడతామని, మరికొద్ది నెలల్లో ఇది పూర్తవుతుందని కంపెనీ తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్న ఉద్యోగులందరినీ తిరిగి ఆఫీసులకు రావాలని కోరింది. ఈ నిర్ణయంతో కొవిడ్-19 మహమ్మారి సమయంలో మొదలైన వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని అధికారికంగా ముగిచినట్టు అయింది. దీంతో నాలుగేళ్ల నుంచి కంపెనీలో కొనసాగుతున్న రిమోట్, హైబ్రిడ్ పని విధానం పూర్తిగా ముగిసింది. కరోనా ఉన్న సమయంలో ఇతర కంపెనీల మాదిరిగానే ఫ్లిప్‌కార్ట్ సైతం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించిన కంపెనీ, గతేడాది నుంచి దశలవారీగా పాలసీని వెనక్కి తీసుకోవడం ప్రారంభించింది. మొదట సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను ఆఫీసులకు రప్పించగా, తాజాగా ఉద్యోగం, పనితీరు సంబంధం లేకుండా అందరినీ ఆఫీసులకు రావాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను దశలవారీగా చేపడతామని, మరికొద్ది నెలల్లో ఇది పూర్తవుతుందని కంపెనీ తెలిపింది. అయితే, కొన్ని ఉద్యోగాలకు పనితీరు ఆధారంగా మినహాయింపు ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. అలాగే, ఒక ఏడాదిలో ఉద్యోగులకు పరిమితంగా కొన్ని రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అవకాశాన్ని ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఉద్యోగులకు ఆఫీసులకు తిరిగి రప్పించడం, తిరిగి కార్యాలయ వాతవరణాన్ని పెంపొందించే లక్ష్యంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి చెప్పారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-కామర్స్, క్విక్-కామర్స్ రంగాల్లో పోటీని ఎదుర్కొనేందుకు కూడా ఫ్లిప్‌కార్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.






