బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్!

by Disha Web Desk 17 |
బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్!
X

బెంగళూరు: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన సరికొత్త బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌ను గురువారం ప్రకటించింది. ప్రధానంగా స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను ఇవ్వనున్నట్టు కంపెనీ వెల్లడించింది. వచ్చే నెల 5-10వ తేదీల మధ్య జరిగే బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌లో ఐఫోన్ 13తో పాటు శాంసంగ్, రియల్‌మీ సహా పలు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై గణనీయమైన రాయితీలు ఇవ్వనుంది.

ఫ్లిప్‌కార్ట్ అధికారిక ప్రకటన ప్రకారం, ఈ బిగ్ సేల్‌లో బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, కొన్ని ఉత్పత్తులపై నో-కాస్ట్ ఈఎంఐ వంటి ప్రయోజనాలు వినియోగదారులకు లభించనున్నాయి. ఇక, మునుపటిలాగే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ ఉన్న కస్టమర్లకు బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ నిర్ణయించిన ఒకరోజు ముందుగానే పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇక, ప్రత్యేక సేల్‌లో ఐఫోన్ 13పై ఎంతవరకు తగ్గింపు ఉంటుందనే దానిపై కంపెనీ అధికారికంగా స్పందించనప్పటికీ, గణనీయమైన తగ్గింపు ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

తాజా ప్రకటనలో పిక్సల్ 6ఏ రూ. 25,999కే లభించనుంది. అలాగే, రియల్‌మీ జీటీ నియో 3టీ స్మార్ట్‌ఫోన్‌ రూ. 19,999కి, లభించనుంది. పోకో ఎక్స్5 ప్రో స్మార్ట్‌ఫోన్‌ రూ. 20,999కి, రియల్‌మీ 10 ప్రో ప్లస్‌ను రూ. 22,999కే కొనే అవకాశాన్ని ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.


Next Story

Most Viewed