- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Flipkart SuperCoins: ఉబర్ రైడ్‌లపై 'సూపర్‌కాయిన్స్' ఆఫర్
ప్రతి ఉబర్ రైడ్‌పై ఖర్చు చేసిన మొత్తంలో 4 శాతం సూపర్‌కాయిన్స్‌గా పొందుతారు. ఒక్కో రైడ్‌కు గరిష్టంగా 150 కాయిన్స్ వరకు పొందవచ్చు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, క్యాబ్ సేవల అగ్రిగేటర్ ఉబర్ కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఉబర్ సేవలను ఉపయోగించుకునే కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన సూపర్‌కాయిన్స్ రివార్డుగా ఇచ్చేలా ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా వినియోగదారులు తమ ఫ్లిప్‌కార్ట్, ఉబర్ అకౌంట్లను లింక్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఉబర్ రైడ్‌పై ఖర్చు చేసిన మొత్తంలో 4 శాతం సూపర్‌కాయిన్స్‌గా పొందుతారు. ఒక్కో రైడ్‌కు గరిష్టంగా 150 కాయిన్స్ వరకు పొందవచ్చు. ఉబర్ రైడ్‌ల ద్వారా సంపాదించిన సూపర్‌కాయిన్స్ నేరుగా వినియోగదారుడి ఫ్లిప్‌కార్ట్ ఖాతాలో జమ అవుతాయి. వీటిని ఫ్లిప్‌కార్ట్, క్లియర్‌ట్రిప్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, ఫ్లిప్‌కార్ట్ ఎకోసిస్టమ్‌లోని ఇతర సేవల్లో రిడీమ్ చేసుకోవచ్చు. కొత్త ఉబర్ వినియోగదారులు, లేదా గత 84 రోజులుగా యాప్‌ను ఉపయోగించని వారు, తమ అకౌంట్లను లింక్ చేసిన 28 రోజుల్లోగా మొదటి రైడ్‌ను పూర్తి చేసి 150 బోనస్ సూపర్‌కాయిన్స్‌ను సంపాదించవచ్చు. ఏప్రిల్ 15–30 మధ్య లింక్ చేసి రైడ్ చేసేవారికి అదనపు రివార్డులు లభిస్తాయని ఇరు కంపెనీలు వెల్లడించాయి. ఈ భాగస్వామ్యం కస్టమర్లకు రోజువారీ రైడ్‌లపై అదనపు ప్రయోజనాలు అందించాలనే ఉద్దేశంతో కుదుర్చుకున్నామని కంపెనీలు పేర్కొన్నాయి.






