- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Economy: దేశ జీడీపీ వృద్ధి అంచనాను 7.4 శాతానికి పెంచిన ఫిచ్
ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల డిసెంబర్‌లో మరో పాలసీ రేటు కోతకు అవకాశం ఉందని అభిప్రాయపడింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాలను గణనీయంగా పెంచుతున్నట్టు ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ గురువారం ప్రకటనలో తెలిపింది. దేశంలో వినియోగం వ్యయం పుంజుకోవడం, జీఎస్టీ సంస్కరణల ద్వారా సెంటిమెంట్ మెరుగుపడటంతో 2025-26కి సంబంధించి దేశ జీడీపీ 6.9 శాతం నుంచి 7.4 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల డిసెంబర్‌లో మరో పాలసీ రేటు కోతకు అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఇప్పటికే 2025లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) 2025లో ఇప్పటివరకు 100 బేసిస్ పాయింట్ల కోత విధిస్తూ, రెపో రేటును 5.25 శాతానికి చేర్చింది. ఇప్పటికే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 8.2 శాతంగా పెరిగింది. అంతకుముందు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7.8 శాతం కంటే ఎక్కువ వృద్ధి నమోదవడం విశేషం. ఇక, ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికానికి వృద్ధి నెమ్మదించవచ్చు. అయినప్పటికీ పూర్తి ఆర్థిక సంవత్సరానికి తాము వృద్ధి అంచనాను 6.9 శాతం నుంచి 7.4 శాతానికి సవరిస్తున్నామని డిసెంబర్ నెలకు సంబంధించిన గ్లోబల్ ఎకనమిక్ ఔట్‌లుక్ నివేదికలో ఫిచ్ పేర్కొంది. ఈ ఏడాది భారత వృద్ధికి ప్రజల ఖర్చు ధోరణి ఎక్కువగా దోహదపడింది. దీనికి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణలు మరింత మద్దతిచ్చాయని ఫిచ్ వెల్లడించింది.






