- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Economy: భారత వృద్ధిని స్వల్పంగా పెంచిన ఫిచ్ రేటింగ్స్
భారత వార్షిక వృద్ధి రేటును 0.2 శాతం పెంచడం విశేషం.

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొంతకాలంగా వివిధ రేటింగ్ ఏజెన్సీలు భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తూ వస్తున్నాయి. దీనికి అమెరికాతో వాణిజ్యం, పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు, వినియోగం క్షీణించడం, గిరాకీ పడిపోవడం వంటి కారణాలను చెబుతున్నాయి. అయితే, తాజాగా ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ భారత వార్షిక వృద్ధి రేటును 0.2 శాతం పెంచడం విశేషం. 2028 ఏడాది వరకు భారత ఆర్థికవ్యవస్థ 6.4 శాతం నమోదు చేస్తుందని గురువారం ప్రకటనలో తెలిపింది. ఇదివరకు 2023లో భారత జీడీపీ 6.2 శాతం పెరుగుతుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా కట్టింది. దేశంలో ఉద్యోగాలు పొందుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న ధోరణిని దృష్టిలో ఉంచుకుని సంస్థ ఈ సవరణ చేసింది. దీనికి తోడు ప్రభుత్వ వ్యయం కొనసాగడం, ద్రవ్యోల్బణం లక్ష్య పరిధిలో ఉండటం, భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) పాలసీ విధానాలు వంటి అంశాలు భారత వృద్ధికి స్థిరంగా కొనసాగిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. ఇదే సమయంలో చైనా వృద్ధి అంచనాను 0.3 శాతం తగ్గించి 4.6 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గించింది. దీని వల్ల ఇతర ఆర్థికవ్యవస్థల కంటే భారత్ వేగవంతమైన వృద్ధిని కొనసాగించగలదనే విశ్వాసం పెరుగుతోంది. వాణిజ్య ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు ఉన్నప్పటికీ భారత్ ఇతర దేశాల కంటే మెరుగైన వృద్ధి సాధించగలదని నిపుణులు వెల్లడించారు.






