- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ashwini Vaishnaw: అతి త్వరలో మొట్టమొదటి మేడ్-ఇన్-ఇండియా చిప్ విడుదల
ప్రస్తుతం దేశంలో ఆరు సెమీకండక్టర్ ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో మొట్టమొదటి మేడ్-ఇన్-ఇండియా చిప్ అతి త్వరలో అందుబాటులోకి వస్తుందని కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఇప్పటికే గుజరాత్, అస్సాం, ఉత్తరప్రదేశ్‌లలో ఆరు సెమీకండక్టర్ ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఆదివారం 'నెక్స్ట్-జెన్ మొబిలిటీ ఫర్ ఎ నెక్స్ట్-జెన్ సిటీ' కార్యక్రమంలో ప్రసంగించిన ఐటీ మంత్రి.. ప్రస్తుతం దేశంలో ఆరు సెమీకండక్టర్ ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. అతి త్వరలో ఈ ప్లాంట్ల నుంచి మొట్టమొదటి మేడ్-ఇన్-ఇండియా చిప్‌ను విడుదల అవుతాయన్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతను సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ సంకల్పంతో ఉంది. ఏఐ అందరికీ అందుబాటులో ఉండాలి. కొందరికే పరిమితం కాకూడదు. మేము ఇండియా ఏఐ మిషన్ ద్వారా 34,000 జీపీయూలు (గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు) అందుబాటులో తీసుకొచ్చినట్టు మంత్రి వివరించారు. ఇదే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. భారత టెక్నాలజీ రంగంలో 'స్వావలంబన'గా మారేందుకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. సెమీకండక్టర్ మిషన్ ఊపందుకుంటున్నందున భారత్ త్వరలో 'మేడ్ ఇన్ ఇండియా' చిప్‌ను తీసుకు వస్తుందన్నారు. వికసిత్ భారత్ ప్రయాణం డిజిటల్ ఇండియా చొరవతో ముందుకు సాగుతుందని, ఇండియా ఏఐ మిషన్‌తో దేశం ప్రపంచ ఏఐకి నాయకత్వం వహించే దిశగా ముందుకు సాగుతోందని వెల్లడించారు.






