- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Semiconductors: అక్టోబర్ నాటికి మొదటి 'మేడ్-ఇన్-ఇండియా' చిప్ విడుదల: అశ్విని వైష్ణవ్
ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సైతం వేగవంతమైన చర్యలను కొనసాగిస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో తొలి 'మేడ్-ఇన్-ఇండియా' చిప్ తీసుకురానున్నట్టు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం విలేకరులతో మాట్లాడిన అశ్విని వైష్ణవ్.. ఇది దేశ టెక్నాలజీ స్వావలంబనలో కీలక అడుగుగా మారనుందని చెప్పారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సైతం వేగవంతమైన చర్యలను కొనసాగిస్తోంది. ఇటీవల దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్, పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ (పీఎస్ఎంసీ) భాగస్వామ్యంతో గుజరాత్‌లోని ధోలేరాలో భారత మొట్టమొదటి సెమీకండక్టర్ ఫ్యాబ్‌ను తయారవుతోంది. ఇందులో వాడే గాలియం నైట్రైడ్ అభివృద్ధి, పరిశోధన కోసం బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ)కి ప్రభుత్వం రూ. 334 కోట్లు మంజూరు చేసింది. కాంపోనెంట్స్ కోసం ప్రభుత్వం త్వరలో ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీమ్‌ను విడుదల చేయనుందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా 234 యూనివర్శిటీల్లో విద్యార్థులకు కొత్త సెమీకండక్టర్ డిజైన్ సాధనాలను అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థం నాటికి మేడ్-ఇన్-ఇండియా చిప్ వడుదలవుతుందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.






