Finance Ministry: యూనియన్ బడ్జెట్‌ కోసం వాణిజ్య, పరిశ్రమ సంఘాల సూచనలు కోరిన ఆర్థిక శాఖ

by S Gopi |

సూచనలు, అభిప్రాయాలను ఉత్పత్తి, ధరలతో సహా సమాచారం, గణాంకాలను కూడా చేర్చాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Finance Ministry: యూనియన్ బడ్జెట్‌ కోసం వాణిజ్య, పరిశ్రమ సంఘాల సూచనలు కోరిన ఆర్థిక శాఖ
X

దిశ, బిజినెస్ బ్యూరో: వచ్చే (2026-27) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2026, ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో పన్ను రేట్లు, పాలసీ విధానాలపై సూచనలు పంపాలని వాణిజ్య, పరిశ్రమ సంఘాలను కోరింది. నవంబర్ 10లోపు సూచనలు పంపాలని పేర్కొంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించి పన్ను నిర్మాణం, రేట్ల సవరణ గురించి సూచనలు ఉండొచ్చు. సూచనలు, అభిప్రాయాలను ఉత్పత్తి, ధరలతో సహా సమాచారం, గణాంకాలను కూడా చేర్చాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే, ఒక వస్తువు కోసం ఇన్వర్టెడ్ డ్యూటీ నిర్మాణంలో మార్పులను సూచించవచ్చని పేర్కొంది. ప్రత్యక్ష పన్నులకు(ఆదాయ లేదా కార్పొరేట్ పన్ను వంటివి) సంబంధించి సిఫార్సులలో మార్పులను సూచించినప్పుడు, వాటి వల్ల కలిగే మంచి పరిణామాలు ఏమిటో కూడా చెప్పాలని, ఆ ప్రయోజనాలను వీలైతే గణాంకాలతో చెప్పే ప్రయత్నం చేయాలని మంత్రిత్వ శాఖ పరిశ్రమను కోరింది.

Next Story