- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెక్నాలజీ ప్రేమికులకు పండుగ లాంటి వార్త.. ఈ మూడు రోజులు ఆఫర్లే ఆఫర్లు!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ప్రైమ్ డే సేల్‌ను నిర్వహించనుంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) మరోసారి వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ప్రైమ్ డే సేల్‌ను (Prime day sales) నిర్వహించనుంది. జులై 12 నుంచి 14 తేదీల వరకు మూడు రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుంది. ఈ సేల్ ప్రత్యేకంగా ప్రైమ్ మెంబర్ల కోసం మాత్రమే ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా అమెజాన్ పలు విభాగాల్లో ఉండే ప్రీమియం ఉత్పత్తులపై కళ్లు చెదిరే డీల్స్, ఆకర్షణీయ తగ్గింపులు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI లాంటి ప్రయోజనాలను అందించనుంది.
ఈ ప్రైమ్ డే సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, హోం అప్లయెన్సెస్, ఆడియో గ్యాడ్జెట్లు, వేరే అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు భారీ తగ్గింపులతో లభించనున్నాయి. శామ్‌సంగ్, యాపిల్, వన్‌ప్లస్, సోనీ, బోట్, జేబీఎల్, ఎల్‌జీ వంటి ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులు ఈ సేల్‌లో భాగమవుతాయి. మరీ ముఖ్యంగా ఈ డీల్స్‌లో శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో కలుపుకొంటే ఈ ఫోన్ ధరను రూ.74,999కు విక్రయించబోతున్నట్లు అమెజాన్ ప్రకటించింది. దీంతో పాటు యాపిల్ ఐఫోన్ 15 ఈ సేల్‌లో రూ.57,999కే లభిస్తుందని తెలిపింది. వన్‌ప్లస్ నుంచి నియో 10ఆర్ రూ.23,499కే విక్రయించనున్నట్లు తెలిపింది. వన్‌ప్లస్ 13ఆర్‌పై రూ.5 వేల డిస్కౌంట్‌తో రూ.49,999కే కొనుగోలు చేయొచ్చని అమెజాన్ చెబుతోంది. అలాగే, లెనోవో స్మార్ట్‌ఛాయిస్ ఐడియా ప్యాడ్ స్లిమ్3ను రూ.61,990కి విక్రయించనున్నట్లు అమెజాన్ తెలిపింది. శాంసంగ్ ట్యాబ్ ఎస్9 ఎఫ్‌ఈ రూ.23,249కి లభిస్తుందని పేర్కొంది.
ఇక పాత ఎలక్ట్రానిక్ వస్తువులను మార్చుకుని కొత్తవి తీసుకునే వారికి ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇంటికి అవసరమైన ఆధునిక గ్యాడ్జెట్లు, అప్లయెన్సులు కొనుగోలు చేయడానికి ఈ సేల్‌ను వినియోగించుకోవచ్చని కంపెనీ సూచిస్తోంది. అయితే ఈ ప్రత్యేక డీల్స్ కేవలం పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటాయని, కావున ప్రైమ్ సభ్యులు ముందుగానే సిద్ధమవ్వాలని సూచించారు.






