- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దలాల్ స్ట్రీట్‌లో పండుగ వాతావరణం.. సెన్సెక్స్ ఏకంగా 2,946 పాయింట్ల జంప్
భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 2,946 పాయింట్లు, నిఫ్టీ 873 పాయింట్లు పెరిగి సరికొత్త రికార్డులను సృష్టించాయి.

దిశ, వెబ్‌డెస్క్: వరుస నష్టాలతో కుదేలైన భారతీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ రికార్డ్ బ్రేక్ చేశాయి. అంతర్జాతీయంగా సానుకూల పవనాలు వీయడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపే మొగ్గు చూపారు. దీంతో ముగింపు సమయానికి సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ (Sensex) ఏకంగా 2,946 పాయింట్ల భారీ లాభంతో 77,562 వద్ద స్థిరపడింది. అదేవిధంగా నిఫ్టీ (Nifty) 873 పాయింట్లు పుంజుకుని 23,997 వద్ద ముగిసింది. కేవలం 3 పాయింట్ల దూరంలో 24 వేల మార్కును మిస్ అయినప్పటికీ, ఇది ఇన్వెస్టర్లలో భారీ ఉత్సాహాన్ని నింపింది. అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం ప్రపంచ మార్కెట్లకు బూస్ట్‌ను ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర సుమారు 13 శాతం తగ్గడం భారత్ వంటి దేశాలకు సానుకూలంగా మారింది. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్ వంటి దిగ్గజ షేర్లలో భారీ కొనుగోళ్లు జరగడంతో స్టాక్ మార్కెట్లు జెట్ స్పీడుతో దూసుకెళ్లాయి.






