- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FDIs: 90 బిలియన్ డాలర్ల మార్కుకు ఎఫ్‌డీఐలు
2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశానికి వచ్చే ఎఫ్‌డీఐ పెట్టుబడుల విలువ 90 బిలియన్ డాలర్ల(రూ. 8.54 లక్షల కోట్ల) మార్కును దాటే అవకాశం ఉంది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) మరో కీలక మైలురాయిని చేరుకునే దిశగా దూసుకుపోతున్నాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశానికి వచ్చే ఎఫ్‌డీఐ పెట్టుబడుల విలువ 90 బిలియన్ డాలర్ల(రూ. 8.54 లక్షల కోట్ల) మార్కును దాటే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మాత్రమే స్థూల ఎఫ్‌డీఐలు 88.29 బిలియన్ డాలర్ల(రూ. 8.37 లక్షల కోట్ల)కు చేరుకోవడం, ఇది గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన మొత్తం 80.61 బిలియన్ డాలర్ల(రూ. 7.65 లక్షల కోట్ల)ను ఇప్పటికే అధిగమించడం గమనార్హం. అదే సమయంలో, నికర ఎఫ్‌డీఐలు కూడా గణనీయంగా పెరిగి 6.26 బిలియన్ డాలర్ల(రూ. 59.41 వేల కోట్ల)కు చేరుకున్నాయి. ఈ వృద్ధికి ప్రధానంగా విధాన సంస్కరణలు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, బలమైన ఆర్థిక వృద్ధి కారణాలని డీపీఐఐటీ కార్యదర్శి అమర్‌దీప్ సింగ్ భాటియా అన్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే, 2030 నాటికి వార్షిక ఎఫ్‌డీఐ నిధులు 100 బిలియన్ డాలర్ల(రూ. 9.48 లక్షల కోట్ల)ను చేరవచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అత్యధిక ఎఫ్‌డీఐ పెట్టుబడులు కెమికల్, ఫార్మా, బయోటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లోకి వచ్చాయని, మొత్తం పెట్టుబడుల్లో ఈ రంగాలు దాదాపు 65 శాతం వాటాను దక్కించుకున్నాయని గణాంకాలు వెల్లడించాయి.






