UPI Transactions : ఇకపై మరింత వేగంగా UPI పేమెంట్స్

by Muthe.Rajitha |

ఇకపై అన్ని రకాల UPI పేమెంట్స్ మరింత జరగనున్నాయి.

UPI Transactions : ఇకపై మరింత వేగంగా UPI పేమెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇకపై అన్ని రకాల UPI పేమెంట్స్ మరింత జరగనున్నాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఈ ప్రకటన విడుదల చేసింది. జూన్ 16 నుంచి దేశంలో అన్ని రకాల UPI, క్రెడిట్, డెబిట్ కార్డ్ పేమెంట్స్ కేవలం 15 సెకన్లలో పూర్తయ్యేలా మార్పులు చేశామని పేర్కొంది. ఇప్పటి వరకు ఇది 30 సెకన్లు ఉండేది. అలాగే ట్రాన్సాక్షన్ స్టేటస్, ట్రాన్సాక్షన్ రివర్సల్, అడ్రస్ వాలిడేషన్ టైం కూడా 30 సెకన్ల నుంచి 10 తగ్గనుందని తెలిపింది.

జూన్ 16 నుంచి రెస్పాన్స్ టైమ్ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పేటీఎం, ఫోన్ పే వంటి సర్వీస్ ప్రొవైడర్లకు, బ్యాంకులకు ఓ సర్క్యులర్ జారీ చేసింది NPCI. రెస్పాన్స్ టైమ్ అంటే మనం చేసిన ట్రాన్సాక్షన్ పూర్తి కావడానికి పట్టే సమయం. ఇకపై ఈ రెస్పాన్స్ టైమ్ 50 శాతానికి తగ్గనుంది. కాగా యూజర్స్ ఎక్స్పీరియన్స్ ను మెరుగు పరించేందుకే ఈ మార్పులు చేస్తున్నట్టు NPCI ఉత్తర్వుల్లో పేర్కొంది.

Next Story