ఆఖరి గంటలో పుంజుకున్న సూచీలు!

by Disha Web Desk 1 |
ఆఖరి గంటలో పుంజుకున్న సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు అనూహ్యంగా వరుస నాలుగో సెషన్‌లో లాభాలను సాధించాయి. బుధవారం ట్రేడింగ్‌లో రోజంతా నష్టాల్లో ర్యాలీ చేసిన సూచీలు చివరి గంటలో లాభాల్లోకి మళ్లడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా ప్రపంచ వృద్ధిపై పెరిగిన ఆందోళనలతో ఉదయం నుంచి బలహీనంగా ఉన్న మన మార్కెట్లు చివరి గంటలో కీలక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్ కంపెనీల షేర్లలో కొనుగోళ్ల జోరు కారణంగా లాభాలకు మారాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 100.26 పాయింట్లు లాభపడి 65,880 వద్ద, నిఫ్టీ 36.15 పాయింట్లు పెరిగి 19,611 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు రాణించాయి. పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, మెటల్ రంగాలు బలహీనపడ్డాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, టైటాన్, అల్ట్రా సిమెంట్, ఐటీసీ, సన్‌ఫార్మా కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకి స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.13 వద్ద ఉంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed