- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జియో యూజర్లకు అదిరిపోయే న్యూస్.. కేవలం రూ.100 రీఛార్జ్‌తో ఎన్ని బెనిఫిట్స్ అంటే?
దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ రిలయన్స్ జియో యూజర్ల కోసం సూపర్ ఆఫర్ తీసుకొచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ రిలయన్స్ జియో (Jio) యూజర్ల కోసం సూపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ ఆఫర్ వినియోగించుకునే యూజర్లు.. లాంగ్ టైమ్ వ్యాలిడిటీతో మొబైల్, టీవీ రెండింటిలోనూ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్‌ను ఉచితంగా ఆస్వాదించవచ్చు. పైగా రీఛార్జ్ ప్లాన్ ధర కేవలం రూ.100 కావటం విశేషం. ఇది OTT ప్రియులకు అద్భుతమైన ప్లాన్ అని చెప్పవచ్చు.
రీఛార్జ్ ప్లాన్ వివరాలు:
జియో కొత్త ప్లాన్ ప్రకారం కేవలం రూ.100 రీఛార్జ్ చేసుకుంటే.. 90 రోజుల వ్యాలిడిటీతో 5GB డేటా, జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా రెండు ప్లాట్‌ఫామ్‌లలో (టీవీ, మొబైల్) కంటెంట్‌ను వీక్షించవచ్చు. సాధారణంగా గతంలో జియో హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందడానికి కనీసం రూ. 299 ధరతో రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు, జియో ఈ ప్రీమియం సేవను రూ. 100 ప్లాన్‌కు తగ్గించింది. అయితే, వినియోగదారులు కొన్ని ముఖ్యమైన షరతులను గమనించాలి. ఈ ఆఫర్‌ను పొందాలంటే.. మీ జియో నంబర్‌పై ఒక యాక్టివ్ బేస్ ప్లాన్ ఉండాలి. నేరుగా కేవలం రూ.100 ప్లాన్ చేసుకునేందుకు కుదరదు.






