- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
EV Sales: 2025లో భారీగా ఈవీ, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు
ఈ ఏడాదిలో ఎక్కువ సంఖ్యలో ఈవీలు మార్కెట్లోకి రావడమే కాకుండా, ప్రధాన కంపెనీలన్నీ దాదాపు ఈవీలను విడుదల చేశాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్రం క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా 2025లో భారీగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) అమ్మకాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఈవీ కార్ల అమ్మకాలు 2025లో ఏకంగా 76 శాతం పెరిగి 1,75,256 యూనిట్లకు చేరాయని బిజినెస్‌టుడె కథనం పేర్కొంది. ముఖ్యంగా ఈ ఏడాదిలో ఎక్కువ సంఖ్యలో ఈవీలు మార్కెట్లోకి రావడమే కాకుండా, ప్రధాన కంపెనీలన్నీ దాదాపు ఈవీలను విడుదల చేశాయి. ముఖ్యంగా స్ట్రాండ్ హైబ్రిడ్ కార్ల అమ్మకాలు 83 శాతం పెరిగి 1,07,196 యూనిట్లకు చేరాయి. దేశంలో 40కి పైగా ఈవీ మోడళ్లతో పోలిస్తే, కేవలం ఎనిమిది మోడళ్ల కారణంగానే హైబ్రిడ్ అమ్మకాలలో 83 శాతం వృద్ధి నమోదవడం గమనార్హం.
ఇందులోనూ టయోటా కిర్లోస్కర్ మోటార్ దేశీయ స్ట్రాంగ్ హైబ్రిడ్ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. అర్బన్ క్రూజర్ హైరైడర్ ఎస్‌యూవీ, ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీ, క్యామ్రీ సెడాన్, ప్రీమియం వెల్‌ఫైర్ ఎంపీవీ వంటి మోడళ్ల ద్వారా మార్కెట్‌లో 80 శాతం కంటే ఎక్కువ వాటాను కంపెనీ సొంతం చేసుకుంది. 2025లో టయోటా 78 శాతం ఎక్కువగా 87,241 హైబ్రిడ్ యూనిట్లను విక్రయించింది. అలాగే, మారుతీ సుజుకి 18,958 కార్లను, హోండా 997 యూనిట్ల హైబ్రిడ్ వాహనాల అమ్మకాలు నమోదు చేశాయి. ఈవీ విభాగంలో టాటా మోటార్స్ 69,236 యూనిట్లతో అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా 51,172 యూనిట్లు(138 శాతం వృద్ధి), మహీంద్రా 33,335 ఈవీల(369 శాతం)ను, హ్యూండాయ్ 6,717 యూనిట్లను, చైనాకు చెందిన బీవైడీ 5,393 యూనిట్ల(91 శాతం)ను, బీఎండబ్ల్యూ 3,197 యూనిట్లు(164 శాతం), కియా ఇండియా 2,174 యూనిట్లు, మెర్సిడెస్-బెంజ్ 1,164 యూనిట్లు, సిట్రియొన్ 870 యూనిట్లు, వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ 798 యూనిట్లు, టెస్లా 223 ఈవీల అమ్మకాలను నమోదు చేశాయి.






