- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
EV Sales: 16 శాతం పెరిగిన ఈవీ విక్రయాలు
అంతకుముందు 2024లో 19,50,727 యూనిట్ల ఈవీ అమ్మకాలు జరిగినట్టు కంపెనీలు వెల్లడించాయని ఫాడా పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: గతేడాది దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) రిటైల్ అమ్మకాల్లో అత్యధికంగా 16.37 శాతం వృద్ధి నమోదైంది. ప్రధానంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 77 శాతం పెరగడంతో 2025లో మొత్తం 22,70,107 యూనిట్ల విక్రయాలు నమోదైనట్టు డీలర్ల సంఘం ఫాడా బుధవారం ప్రకటనలో తెలిపింది. అంతకుముందు 2024లో 19,50,727 యూనిట్ల ఈవీ అమ్మకాలు జరిగినట్టు కంపెనీలు వెల్లడించాయని ఫాడా పేర్కొంది. ముఖ్యంగా ఈవీ కార్లు గతేడాది 77.04 శాతం ఎక్కువగా 1,76,817 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే సమయంలో ఈ-కమర్షియల్ వాహనాల అమ్మకాలు 54.2 శాతం పెరిగి 15,606 యూనిట్లకు చేరాయి. ఈవీ టూ-వీలర్ విక్రయాలు 12,79,951 యూనిలతో 11.36 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ-త్రీవీలర్ విభాగంలో 15.39 శాతం ఎక్కువగా 7,97,733 యూనిట్ల అమ్మకాలు జరిగాయని ఫాడా పేర్కొంది. దేశీయ వాహన మార్కెట్లో ఈవీలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది వీటి వినియోగానికి అనుగుణంగా దేశంలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, పాలసీల కొనసాగింపు వంటి చర్యలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఫాడా అధ్యక్షుడు సీఎస్ విఘ్నేశ్వర్ వెల్లడించారు.






