Eternal: జొమాటో మాతృసంస్థ ఎటర్నల్‌కు రూ. 3.7 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసులు

by S Gopi |

సమీక్షించిన కాలంలో ఎటర్నల్ సంస్థ చెల్లించాల్సిన దానికంటే తక్కువ జీఎస్టీని చెల్లించిందని అధికారులు నోటీసుల్లో వివరించారు.

Eternal: జొమాటో మాతృసంస్థ ఎటర్నల్‌కు రూ. 3.7 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో, క్విక్ కామార్స్ బ్లింక్ఇట్ మాతృసంస్థ ఎటర్నల్ భారీ పన్ను నోటీసులను అందుకుంది. పశ్చిమ బెంగాల్ పన్ను అధికారుల నుంచి కంపెనీ ఈ జీఎస్టీ పన్ను డిమాండ్ నోటీసులను అందుకుంది. ఇది 2019, ఏప్రిల్ నుంచి 2020, మార్చి మధ్య కాలానికి సంబంధించిన అవకతవకలకు గానూ రూ. 3.69 కోట్లు చెల్లించాలని జీఎస్టీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. మొత్తం పన్ను డిమాండ్‌లో రూ. 1.92 కోట్ల జీఎస్టీ, ఆలస్య చెల్లింపు కారణంగా రూ. 1.58 కోట్ల వడ్డీ, రూ. 19 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంది. సమీక్షించిన కాలంలో ఎటర్నల్ సంస్థ చెల్లించాల్సిన దానికంటే తక్కువ జీఎస్టీని చెల్లించిందని, ఆలస్యమైనందుకు వడ్డీ, సరైన మొత్తాన్ని చెల్లించని కారణంగా జరిమానాను విధించినట్టు అధికారులు నోటీసుల్లో వివరించారు. ఈ నోటీసులపై స్పందించిన ఎటర్నల్ కంపెనీ ఈ ఆర్డర్‌తో తాము ఏకాభవించడంలేదని, ఈ పన్ను నోటీసులను సవాలు చేస్తమని, దీనిపై అప్పీలుకు వెళ్తామని వెల్లడించింది.

Next Story