EPFO: వాట్సాప్‌లో ఈపీఎఫ్ఓ సేవలు

by S Gopi |

దీనికోసం ఈపీఎఫ్ఓ అధికారిక వాట్సాప్ నంబర్‌కు 'హెలో' అని మెసేజ్ పంపితే సరిపోతుంది.

EPFO: వాట్సాప్‌లో ఈపీఎఫ్ఓ సేవలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) తన సేవలను మరింత సులభతరం చేయడానికి వాట్సాప్ ఆధారిత కొత్త సేవలను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. కోట్లాది మంది పీఎఫ్ సబ్‌స్క్రైబర్లు తమ ఖాతా వివరాలను వేగంగా, సులభంగా తెలుసుకునేలా చేయడమే ఈ డిజిటల్ చొరవ ప్రధాన లక్ష్యమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. వాట్సాప్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్లకు పీఎఫ్ బ్యాలెన్స్, క్లెయిమ్ స్టేటస్, చివరి ఐదు లావాదేవీలు, పెండింగ్ వంటి సేవలను పొందవచ్చు. దీనికోసం ఈపీఎఫ్ఓ అధికారిక వాట్సాప్ నంబర్‌కు 'హెలో' అని మెసేజ్ పంపితే సరిపోతుంది. ఆ తర్వాత, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను ఈపీఎఫ్ఓ వెరిఫై చేస్తుంది. అనంతరం వినియోగదారులకు సులభమైన మెనూ ఆప్షన్లు కనిపిస్తాయి. వాటి ద్వారా సబ్‌స్క్రైబర్లు తమకు అవసరమైన సేవను ఎంచుకుని వెంటనే సమాచారం పొందవచ్చు. ముఖ్యంగా పీఎఫ్ క్లెయిమ్ స్టేటస్, బ్యాలెన్స్ చెకింగ్ వంటి సేవలు ఇకపై మరింత వేగంగా అందుబాటులోకి రానున్నాయి.

ఈపీఎఫ్ఓ ఈ సేవలను స్థానిక భాషల్లో కూడా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏఐ ఆధారిత చాట్‌బాట్ ద్వారా 24 గంటల సపోర్ట్ అందించే వ్యవస్థను సైతం రూపొందిస్తున్నారు. సబ్‌స్క్రైబర్లు తరచుగా ఎదుర్కొనే సాధారణ సమస్యలకు వెంటనే సమాధానాలు ఇవ్వడంతో పాటు, పెండింగ్ ఆధార్ వెరిఫికేషన్, డీబీటె యాక్టివేషన్ గురించి ప్రత్యేక సహాయం కూడా అందించనున్నారు.

Next Story