- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
World Bank: భారత్‌లో జనాభా కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు: ప్రపంచ బ్యాంక్
పనిచేయగలిగిన వారి కంటే ఉద్యోగాల సృష్టి ఎక్కువ జరిగాయి. మొత్తం శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం కూడా చాలా పెరిగింది

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో ఉద్యోగల పెరుగుదలకు సంబంధించి ప్రపంచ బ్యాంకు కీలక వివరాలను వెల్లడించింది. గత కొన్నాళ్లుగా దేశంలో ఉద్యోగాల పెరుగుదల అత్యంత సానుకూలంగా ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి దేశంలో జాబ్ మార్కెట్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి నుంచి పనిచేయగలిగిన వారి కంటే ఉద్యోగాల సృష్టి ఎక్కువ జరిగాయి. ఇదే సమయంలో మొత్తం శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం కూడా చాలా పెరిగింది. ప్రధానంగా మహిళల్లో ఎక్కువమంది పనిచేస్తున్నారు. పట్టణ ప్రాంతాలకు సంబంధించి నిరుద్యోగం 2024-25 తొలి త్రైమాసికంలో 6.6 శాతానికి పడిపోయింది. ఇది 2017-18 నాటి కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఈ గణాంకాలు కొవిడ్-19 మహమ్మారి తర్వాత భారత్‌లో వేగంగా మెరుగుపడుతున్న ఉపాధి అవకాశాలకు సంకేతమని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది.
గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం.. గ్రామీణ ప్రాంతాల్లోని ఎక్కువ మంది ఉపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్లడం పెరిగింది. 2018-19 తర్వాత తొలిసారి ఉపాధి కోసం పట్టణాలకు వెళ్లే గ్రామీణ ప్రాంత ప్రజల వలసలు గణనీయంగా పెరిగాయి. ఇదే సమయంలో గ్రామీణంలో మహిళలు ఎక్కువగా శ్రామిక వర్గంలోకి, ప్రధానంగా వ్యవసాయ రంగంలోకి వెళ్తున్నారని నివేదిక పేర్కొంది. మరోవైపు, మహిళల్లో ఉపాధి, ఉద్యోగాలకు వెళ్లే వారిలోనూ అసమానతలు కూడా ఎక్కువగానే ఉన్నాయని నివేదిక వివరించింది.
ఉద్యోగాలు వేగంగా పెరుగుతున్నప్పటికీ, ఉద్యోగాల కోసం చూసే యువత కూడా పెరగడం కొంత ఆందోళన కలిగించే అంశం. దేశంలో ప్రస్తుతం 13.3 శాతం యువత ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. ఉన్నత విద్య పూర్తి చేసిన వారిలో 29 శాతం మంది ఇంకా ఉద్యోగాల వేటలోనె ఉన్నారు. 2022-23లో దేశీయంగా పేదరికాన్ని తగ్గించడంలో మెరుగుదల ఉన్నప్పటికీ అధిక జనాభా ఉన్న యూపీ, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఇంకా అత్యంత పేద రాష్ట్రాలుగానే ఉన్నాయని నివేదిక వెల్లడించింది.






