UPS: ఇకపై యూపీఎస్ కింద ఉద్యోగులకు పదవీ విరమణ, డెత్ గ్రాట్యుటీ ప్రయోజనాలు

by S Gopi |

పదవీ విరమణ ప్రయోజనాలలో సమానత్వాన్ని తీసుకువస్తుందని ఆయన తెలిపారు.

UPS: ఇకపై యూపీఎస్ కింద ఉద్యోగులకు పదవీ విరమణ, డెత్ గ్రాట్యుటీ ప్రయోజనాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఏకీకృత పెన్షన్ పథకం(యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీం-యూపీఎస్‌)లో భాగమైన అందరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు పాత పెన్షన్ పథకం కింద లభించే పదవీ విరమణ, డెత్ గ్రాట్యుటీ ప్రయోజనాలకు అర్హులు అవుతారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ మంది నుంచి దీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్‌ను నిజం చేస్తూ ఈ చర్య ప్రభుత్వ సిబ్బందికి ప్రయోజనం లభిస్తుందని, పదవీ విరమణ ప్రయోజనాలలో సమానత్వాన్ని తీసుకువస్తుందని ఆయన తెలిపారు. జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద అన్ని వర్గాల ఉద్యోగులకు సామాజిక భద్రతను నిర్ధారించాలనే ప్రభుత్వ నిబద్ధతను కొత్త నిబంధన ప్రతిబింబిస్తుందని సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద గ్రాట్యుటీ చెల్లింపు) రూల్స్, 2021 నిబంధనల ప్రకారం, యూపీఎస్ కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు పదవీ విరమణ, డెత్ గ్రాట్యుటీ ప్రయోజనాలకు అర్హులు అవుతారు. సిబ్బంది మంత్రిత్వ శాఖ పరిధిలోని పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ (డీఓపీపీడబ్ల్యూ) ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు చాలా మంది ఉద్యోగులు యూపీఎస్‌ను ఎంచుకుంటారని ఆల్ ఇండియా ఎన్‌పిఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు మంజీత్ సింగ్ పటేల్ పేర్కొన్నారు.

Next Story