Elon Musk: 600 బిలియన్ డాలర్ల తొలి సంపన్నుడిగా ఎలన్ మస్క్ రికార్డు

by S Gopi |

ఈ ఏడాది అక్టోబర్‌లోనే మొదటిసారిగా 500 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించిన మస్క్..

Elon Musk: 600 బిలియన్ డాలర్ల తొలి సంపన్నుడిగా ఎలన్ మస్క్ రికార్డు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలన్ మస్క్ మరిన్ని కొత్త రికార్డులతో ఎవ్వరికీ అందనంత ఎత్తుకు వెళ్తున్నారు. తాజాగా ప్రపంచంలోనే 600 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 54.54 లక్షల కోట్లు) సంపద ఉన్న మొదటివ్యక్తిగా నిలిచారు. మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ స్టార్టప్ 800 బిలియన్ల డాలర్ల విలువతో ఐపీఓకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన సంపద భారీగా పుంజుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లోనే మొదటిసారిగా 500 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించిన మస్క్, వచ్చే ఏడాది ఐపీఓకు వస్తున్న స్పేస్‌ఎక్స్‌లో 42 శాతం వాటాను కలిగి ఉన్నట్టు రాయిటర్స్ పేర్కొంది. ఫోర్బ్స్ ప్రకారం, స్పేస్‌ఎక్స్ వాల్యుయేషన్ కారణంగా మస్క్ సంపద 168 బిలియన్ డాలర్లు పెరిగి 677 బిలియన్ డాలర్లకు చేరింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ టెస్లాలో మస్క్‌కు దాదాపు 12 శాతం వాటా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు టెస్లా షేర్లు అమ్మకాలు తగ్గినప్పటికీ 13 శాతం పెరిగాయి. ఎలన్ మస్క్ సంపద 600 బిలియన్ డాలర్లు పెరగడ్మతో ప్రపంచంలో ఏ ధనవంతుడు సాధించని స్థాయిలో సంపదను సంపాదించారు. ఫోర్బ్స్ వివరాల ప్రకారం, ఎలన్ మస్క్ తర్వాత ప్రపంచ సంపన్నుల్లో ఒరాకిల్ ఫౌండర్ ల్యారీ ఎలిసన్ 400 బిలియన్ డాలర్ల మార్కును తాకారు. ఆ తర్వాత ఆయన సంపద క్షీణించింది. ప్రస్తుతం ఆయన సంప్ద 265 బిలియన్ డాలర్ల వద్ద ఉంది.

Next Story