- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Elon Musk: చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్.. 400 బిలియన్ డాలర్లు దాటిన సంపద..!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక టెస్లా(Tesla), స్పేస్ ఎక్స్(Space X) సంస్థల అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) సంపద గణనీయంగా పెరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక టెస్లా(Tesla), స్పేస్ ఎక్స్(Space X) సంస్థల అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) సంపద గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం మస్క్ నికర సంపద 442 బిలియన్ డాలర్ల(ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 38 లక్షల కోట్లు)కు చేరుకుందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్(Bloomberg Billionaire Index) పేర్కొంది. యూఎస్ అధ్యక్ష ఎన్నికల తర్వాత నుంచి టెస్లా షేర్ల విలువ ఏకంగా 65శాతం వరకు పెరగడంతో ఆయన సంపద 400 బిలియన్ డాలర్లు దాటింది. దీంతో ఈ మార్క్ ను క్రాస్ చేసిన మొదటి వ్యక్తిగా మస్క్ రికార్డు క్రియేట్ చేశారు.
కాగా కొత్త ప్రభుత్వంలో మస్క్ ను గవర్నమెంట్ ఎఫిషియెన్సీ డిపార్ట్మెంట్(GED)కు హెడ్(Head)గా ట్రంప్ నియమించిన విషయం తెలిసిందే. దీంతో టెస్లా కంపెనీ షేర్ల విలువలు రాకెట్(Rocket)లా దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన సంపద భారీగా పెరిగినట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇక అమెజాన్(Amazon) ఫౌండర్ జెఫ్ బెజోస్(Jeff Bezos) 248 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా.. మెటా సీఈఓ(Meta CEO) మార్క్ జుకర్‌బర్గ్ 223 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఒరాకిల్(Oracle) చైర్మన్ లారీ ఎల్లిసన్(Larry Ellison) $195B, ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ దిగ్గజ కంపెనీ ‘ఎల్‌వీఎంహెచ్(LVMH)’ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్(Bernard Arnault) 181 బిలియన్ డాలర్లతో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.






