- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Elon Musk: 700 బిలియన్ డాలర్ల కుబేరుడిగా ఎలన్ మస్క్ రికార్డులు
మన కరెన్సీలో దీన్ని లెక్కిస్తే రూ. 62.70 లక్షల కోట్లు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ బిలియనీర్ కొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఇటీవలే ప్రపంచంలో 600 బిలియన్ డాలర్ల సంపద కలిగిన వ్యక్తిగా నిలిచిన మస్క్, తాజాగా మరో చరిత్ర సృష్టించారు. 2018లో టెస్లా మస్క్‌కు ప్రకటించిన 55 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీ విషయంలో డెలావేర్ సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఈ ఘనతను సాధించారు. దీంతో టెస్లా సీఈఓ చరిత్రలోనే 700 బిలియన్ డాలర్లకు పైగా సంపద ఉన్న తొలి వ్యక్తి అయ్యారు. మన కరెన్సీలో దీన్ని లెక్కిస్తే రూ. 62.70 లక్షల కోట్లు. టెస్లా కంపెనీ వృద్ధిలో కీలకంగా నిలిచినందుకు కంపెనీ బోర్డు నిర్ణయించింది. కానీ, ఈ స్థాయి ప్యాకేజీపై ఓ వాటాదారు అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో డెలావేర్ కోర్టే అనుమతుల్లో నిబంధనలు పాటించలేదని అభిప్రాయపడింది. దీన్ని రద్దు చేస్తున్నట్టు 2024లో కింది కోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని పునరుద్ధరించాలని తాజాగా డెలావేర్ కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఫోర్బ్స్ బిలియనీర్ల సూచీలో టెస్లా స్టాక్ ఆప్షన్లను పునరుద్ధరించడంతో ఎలన్ మస్క్ సంపదను 749 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. ప్యాకేజీ పునరుద్ధరణ వల్ల ఎలన్ మస్క్ సంపదలో కొత్తగా 139 బిలియన్ డాలర్లు చేరాయి.






