- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Edible Oil: వంట నూనె ధరలకు రెక్కలు
ఇటీవలే మార్చిలో పెంపు జరిగిన నేపథ్యంలో, మరోసారి ధరలు పెంచితే వినియోగదారులపై అదనపు భారం కానుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: సామాన్యులకు మరోసారి వంట నూనె ధరల షాక్ తగలనుంది. పెరిగిన దిగుమతి ఖర్చులు, రవాణా వ్యయాలు, అలాగే దేశీయ నూనెగింజల ధరలు అధికంగా ఉండటం వల్ల కంపెనీల లాభాలు కోల్పోతున్నాయి. మార్జిన్‌లను కాపాడుకునేందుకు ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్, ఇమామి ఆగ్రోటెక్, పతంజలి ఫుడ్స్ వంటి ప్రధాన సంస్థలు 5–6 శాతం మేర పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి. ఇటీవలే మార్చిలో పెంపు నిర్ణయం జరిగిన నేపథ్యంలో, మరోసారి ధరలు పెంచితే వినియోగదారులపై అదనపు భారం పడనుంది. సాధారణంగా ముడి చమురు ధరలు, రవాణా పరిస్థితుల ఆధారంగా వంట నూనె ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. తాజాగా, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి ద్వారా సరఫరా అంతరాయాల భయాల కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 115 డాలర్లకు తీసుకెళ్లాయి. మనదేశం వంట నూనె అవసరాలలో సుమారు 57 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెలు ఎక్కువ వినియోగంలో ఉంటాయి. అయితే గతేడాదితో పోలిస్తే ధరలు గణనీయంగా పెరిగాయి. పామాయిల్ 14 శాతం, సోయాబీన్ 20 శాతం, సన్‌ఫ్లవర్ 17 శాతం వరకు ఖరీదయ్యాయి. రవాణా, బీమా ఖర్చులు పెరగడం, రూపాయి విలువ ఒత్తిడిలో ఉండటం కూడా ఈ భారాన్ని మరింత పెంచుతోంది.






