- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dunkin and Donuts: భారత మార్కెట్‌కు డంకిన్ డోనట్స్ గుడ్‌బై
డొనట్స్‌తో పాటు వివిధ రకాల రుచులతో కాఫీ అందించే ఈ కంపెనీ ఈ ఏడాది ఆఖరు నాటికి దేశంలో కార్యకలాపాలను నిలిపేస్తున్నట్టు వెల్లడించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన ప్రముఖ కాఫీ స్టోర్ దిగ్గజం డంకిన్ డోనట్స్ భారత మార్కెట్‌కు గుడ్‌బై చెప్పడానికి సిద్ధమవుతోంది. డొనట్స్‌తో పాటు వివిధ రకాల రుచులతో కాఫీ అందించే ఈ కంపెనీ ఈ ఏడాది ఆఖరు నాటికి దేశంలో కార్యకలాపాలను నిలిపేస్తున్నట్టు వెల్లడించింది. దేశీయ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ చెయిన్ జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఫ్రాంచైజీ ద్వారా మనదేశంలో డంకిన్ డొనట్స్ పనిచేస్తోంది. ఈ రెండు సంస్థల మధ్య 2011, ఫిబ్రవరిలో ఒప్పందం జరగ్గా, అప్పటినుంచి జుబిలెంట్ డంకిన్ డోనట్స్ బ్రాండ్‌ను అందిస్తోంది. 15 ఏళ్ల కోసం జరిగిన ఈ ఒప్పందం ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది డిసెంబర్ 31తో ఇది ముగుస్తుండగా, దీన్ని పొడిగించే ఆలోచన తమకు లేదని జుబిలెంట్ స్పష్టం చేయడంతో డంకిన్ డోనట్స్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రధానంగా డంకిన్ డోనట్స్‌కు మనదేశంలో గిరాకీ లేకపోవడం, వరుస నష్టాలు ఎదురవడమే కారణం. మరోవైపు డోమినోస్ పిజ్జా వ్యాపారం విజయవంతంగా కొనసాగుతుండటంతో జుబిలెంట్ కంపెనీ డంకిన్‌ను నిర్వహించేందుకు ఆసక్తి చూపించడంలేదు.






