Dream11: కొత్త అవతారంలోకి డ్రీమ్11.. స్పోర్ట్స్-ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌గా రీ-ఎంట్రీ

by S Gopi |

ఇందులో భాగంగా గురువారం కంపెనీ సెకెండ్-స్క్రీన్ స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌గ మారుతున్నామని ప్రకటించింది.

Dream11: కొత్త అవతారంలోకి డ్రీమ్11.. స్పోర్ట్స్-ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌గా రీ-ఎంట్రీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్11 కొత్త అవతారంలోకి మారుతోంది. కేంద్రం ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్‌పై భారీ పన్నులు విధిస్తూ రాత్రికి రాత్రే అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో డ్రీమ్11 కంపెనీ తీవ్రంగా దెబ్బతిన్నది. ముఖ్యంగా రియల్-మనీ గేమింగ్‌పై నిషేధం విధించడంతో కంపెనీ దాదాపు అన్ని ఆదాయ మార్గాలను కోల్పోయింది. దీంతో కొత్త మార్గంలో కంపెనీ ఫ్యాన్స్, క్రియేటర్స్, లైవ్ స్పోర్ట్స్ చుట్టూ కొత్తగా రూపాంతరం కావాలని చూస్తోంది. ఇందులో భాగంగా గురువారం కంపెనీ సెకెండ్-స్క్రీన్ స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌గ మారుతున్నామని ప్రకటించింది. 25 కోట్ల మంది యూజర్లు ఉన్న డ్రీమ్11 ఇకపై ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్పోర్ట్స్ చూసే అభిమానులకు కొత్త అనుభూతిని అందించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

కొత్త ప్లాట్‌ఫామ్ గురించి

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ప్రముఖ స్పోర్ట్స్ క్రియేటర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్లు మ్యాచ్‌ను లైవ్ చూడవచ్చు. అదే సమయంలో ప్లాట్‌ఫామ్‌లో లైవ్ స్పోర్ట్స్ గురించి మాట్లాడుకోవచ్చు. క్రీడాభిమానులు కూడా మ్యాచ్ సమయంలో గ్రూప్ హ్యాంగ్అవుట్ లాగా వారితో చర్చించేందుకు వీలుంటుంది. స్పోర్ట్స్ ఫ్యాన్స్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు లైవ్ రియాక్షన్స్, చాట్, కామెంట్ ద్వారా అభిప్రాయాలను పంచుకోవచ్చు. లైవ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఉచితంగా ఫాంటసీ స్పోర్ట్స్‌ను ఆడే అవకాశం కూడా ఉంటుందని డ్రీమ్11 పేర్కొంది.

Next Story