ఖాతాదారులకు RBI హెచ్చరిక.. అలా చేస్తే జైలు శిక్ష తప్పదు!

by Naga Rani Yarlagadda |

మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు.. చాలా ఈజీగా డబ్బు సంపాదించవచ్చని వచ్చే ఆఫర్లపై ఖాతాదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని RBI హెచ్చరిస్తోంది.

ఖాతాదారులకు RBI హెచ్చరిక.. అలా చేస్తే జైలు శిక్ష తప్పదు!
X

దిశ, వెబ్‌డెస్క్: మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు.. చాలా ఈజీగా డబ్బు సంపాదించవచ్చని వచ్చే ఆఫర్లపై ఖాతాదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని RBI హెచ్చరిస్తోంది. ఎవరైనా మీ బ్యాంక్ అకౌంట్ ను ఉపయోగించుకుని కేవలం డబ్బును ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ చేసినందుకు కమీషన్ ఇస్తామని ఆశ చూపితే నమ్మవద్దని సూచించింది. అక్రమంగా సంపాదించిన సొమ్ము లేదా నేరాలకు సంబంధించిన సొమ్మును ఇలా వేరొకరికి అకౌంట్ల నుంచి ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తుల్ని మనీ మ్యూల్స్ అంటారు. మీకు తెలియకుండా ఇలాంటి పొరపాట్లు చేస్తే.. అవి మిమ్మల్ని తీవ్రమైన చట్టపరమైన ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

మీ బ్యాంక్ అకౌంట్ ను మీ వ్యక్తిగత అవసరాల కోసమే వాడుకోవాలని, అందులో ఉన్న డబ్బుకు మీరే పూర్తి బాధ్యులవుతారని RBI స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బును బదిలీ చేసేందుకు బ్యాంక్ అకౌంట్ ను ఇతరులను ఉపయోగించుకోనివ్వొద్దని చెప్పింది. మీ అకౌంట్ నుంచి అపరిచిత వ్యక్తుల డబ్బును పొందేందుకు లేదా పంపే పనులు చేస్తే.. జైలుశిక్ష కూడా పడవచ్చని వివరించింది. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండేందుకు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలు, పాస్ వర్డ్ లు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది. ఈ డిజిటల్ యుగంలో మీ వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవడమే మీ అకౌంట్ కు, మీకు రక్షణనిస్తుందని, ఈజీ మనీకోసం ఆశపడి జీవితాన్ని రిస్కులో పెట్టుకోవద్దని వినియోగదారులను కోరింది. దీనిపై మరింత సమాచారం కోసం.. RBI అధికారిక వెబ్ సైట్ https://rbikehtahai.rbi.org.in/telugu/index.html ను విజిట్ చేయాలని తెలిపింది.

Next Story