Trump Business: భారత్‌లో ట్రంప్ బిజినెస్ సూపర్ సక్సెస్...ఒక్కరోజులోనే రూ. 3250 కోట్ల భారీ లాభం..

by Vennela |

Trump Business: భారత్‌లో ట్రంప్ బిజినెస్ సూపర్ సక్సెస్...ఒక్కరోజులోనే రూ. 3250 కోట్ల భారీ లాభం..
X

దిశ, వెబ్ డెస్క్: Trump Business: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ లో వ్యాపారం చేయడమేంటి అది కూడా ఒక రోజులోనే 3000 కోట్లకు పైగా లాభం సాధించడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.? అవును మీరు వింటున్నది నిజమే.? డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకముందు అమెరికాలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్లలో ఒకరు. ఆయన పేరిట ట్రంప్ టవర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి.

అమెరికాలో దాదాపు అన్ని నగరాల్లోనూ ట్రంప్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలు ఉన్నాయి. ఆయన ఈ వ్యాపారంలో దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. తాజాగా డోనాల్డ్ ట్రంప్ ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ లో ట్రంప్ టవర్స్ పేరిట మరో కమర్షియల్ ప్రాపర్టీని ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం గురుగ్రామ్ లోని ట్రంప్ రెసిడెన్స్ టవర్ ప్రారంభించిన రోజే రూ.3,250 కోట్లకు అమ్ముడైంది.

ఈ ప్రాజెక్టులో రూ.125 కోట్ల విలువైన అల్ట్రా-ప్రీమియం పెంట్‌హౌస్‌లు కూడా పూర్తిగా అమ్ముడయ్యాయి. ఈ ట్రంప్ ప్రాజెక్ట్‌లో 298 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అమ్ముడయ్యాయి. వీటిలో ఒక్కో యూనిట్ ధర రూ.8 కోట్ల నుండి రూ.15 కోట్ల వరకు ఉంటుంది. ట్రంప్ టవర్ వ్యాపారం ద్వారా భారతదేశంలో బ్రాండెడ్, అల్ట్రా-లగ్జరీ నివాసాలకు పెరుగుతున్న డిమాండ్‌ ఎలాంటిందో నిరూపించింది.

ట్రంప్ టవర్స్, స్మార్ట్ వరల్డ్, ట్రిబెకా భారతదేశంలోని డెవలపర్ల సహకారంతో నిర్మిస్తున్నారు. ఈ అమ్ముడుపోయిన ప్రాజెక్ట్‌లో రెండు 51 అంతస్తుల టవర్లు ఉన్నాయి. స్మార్ట్‌వరల్డ్ ట్రంప్ టవర్స్ నిర్మాణం, కస్టమర్ సర్వీస్‌ను పర్యవేక్షిస్తుండగా, ట్రిబెకా భారతదేశంలో ట్రంప్ బ్రాండ్ అధికారిక ప్రతినిధిగా ఉంది. అలాగే డిజైన్, పంపిణీ, సేల్స్, క్వాలిటీ కంట్రోల్ కు బాధ్యత వహిస్తుంది.

2018లో గురుగ్రామ్‌లో ప్రారంభించిన మొదటి ట్రంప్ టవర్స్ పూర్తిగా అమ్ముడయ్యాయి, ఈ నెలాఖరులో డెలివరీకి సిద్ధంగా ఉందని భారతదేశంలో ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అలైడ్ డెవలపర్స్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. స్మార్ట్‌వరల్డ్ డెవలపర్స్ వ్యవస్థాపకుడు పంకజ్ బన్సాల్ ప్రకారం, ట్రంప్ రెసిడెన్స్‌కు లభించిన అపూర్వమైన కస్టమర్ స్పందన భారతదేశంలో అటువంటి ఆస్తులలో ప్రపంచ స్థాయి జీవనానికి పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనం.

ట్రిబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా మాట్లాడుతూ, ట్రంప్ రెసిడెన్స్ గురుగ్రామ్ మొదటి రోజు రూ.3,250 కోట్లకు అమ్ముడైందని, ఇది దేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద లగ్జరీ డీల్స్‌లో ఒకటిగా నిలిచిందని అన్నారు. ట్రంప్ ప్రస్తుతం ముంబై, పూణే, గురుగ్రామ్, కోల్‌కతాలో ఒక్కొక్కటి చొప్పున ఐదు ఎత్తైన లగ్జరీ నివాస ఆస్తులను కలిగి ఉన్నారు. త్వరలోనే ట్రంప్ టవర్ హైదరాబాదులో కూడా కనిపించనుంది. ఇప్పటికే ట్రంప్ కంపెనీ కోకాపేటలో ఒక భారీ ప్రాజెక్టు నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Next Story