- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశీయ స్టాక్ మార్కెట్ల జోరు.. 648 పాయింట్ల లాభంతో సెన్సెక్స్
కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్లలోని సంకేతాలకు తోడు నెలవారీ డెరివేటివ్ కాంట్రాక్టుల (Derivative Contracts) గడువు ముగియనున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Domestic Stock Market Indices) సోమవారం లాభాలతో మొదలయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్లలోని సంకేతాలకు తోడు నెలవారీ డెరివేటివ్ కాంట్రాక్టుల (Derivative Contracts) గడువు ముగియనున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Domestic Stock Market Indices) సోమవారం లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 10.20కి సెన్సెక్స్ (Sensex) 648 పాయింట్ల లాభంతో 82,369 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ (NIFTY) 169 పాయింట్ల లాభంతో 25,022 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 44 పైసలు పెరిగి, 85.01 వద్ద ఉంది.
దివీస్ లాబొరెటరీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, మాక్రోటెక్ డెవలపర్స్, టాటా మోటార్స్, హీరో మోటో కార్ప్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఇక జోమాటో, ఐసీఐసీఐ లాంబార్డ్, శ్రీ సిమెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, స్విగ్గీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు ఉదయం నుంచి నష్టాలను చవిచూస్తున్నాయి.






