లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. ఇన్వెస్టర్లు ఫుల్ ఖుష్

by Kema Shiva Kumar |

అమెరికా (America)-జపాన్ (Japan) మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సూచీలు ఇవాళ లాభాలతో క్లోజ్ అయ్యాయి.

లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. ఇన్వెస్టర్లు ఫుల్ ఖుష్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా (America)-జపాన్ (Japan) మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సూచీలు ఇవాళ లాభాలతో క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా ఆటో, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో కొనుగోళ్లు సూచీలకు మంచి బూస్ట్‌ను ఇచ్చాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 539 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ (NIFTY) 159 పాయింట్లు ఎగబాకి 25,219 వద్ద ముగిసింది. కాగా, సెన్సెక్స్‌ ఉదయం 82,451.87 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 82,786.43 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. 539.83 పాయింట్ల లాభంతో 82,726.64 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో 25,219.90 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.43గా ఉంది.

ఇండియన్ రైల్వే ఫైనాన్స్, టాటా మోటార్స్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, భారతీ ఎయిర్‌టెల్, అపోలో హాస్పిటల్స్, ఆర్ఈసీ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక లోధా డెవెలపర్స్, టాటా కన్‌జ్యూమర్ ప్రొడక్ట్స్, ఐసీఐసీఐ లాంబర్డ్, హిందుస్థాన్ లివర్, సైమెన్స్ ఎనర్జీ ఇండియా, హిందుస్థాన్ ఏరోనాటికల్స్, ఇంటర్ గ్రోబ్ ఏవియేషన్. గోద్రేజ్ కన్‌జ్యూమర్ ప్రొడక్ట్, ఏబీబీ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీ సిమెంట్ షేర్లు నష్టాల బాటలో పయనించాయి.

Next Story