Aviation Industry: దేశీయ విమానయాన పరిశ్రమకు రూ. 18,000 కోట్ల నష్టం

by S Gopi |

ఈ ఏడాది ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం, ఇండిగో వేలాది విమానాలను రద్దు సంక్షోభాల వల్ల ప్రయాణికుల రద్దీ అంచనాను తగ్గించింది.

Aviation Industry: దేశీయ విమానయాన పరిశ్రమకు రూ. 18,000 కోట్ల నష్టం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమానయాన రంగం భారీ కష్టాలను చూసింది. ప్రయాణికుల రద్దీ తగ్గడంతో పాటు ఇతర కారణాల వల్ల ఈ రంగం రూ. 17,000-18,000 కోట్ల నష్టాలను చూసే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా సోమవారం ప్రకటనలో తెలిపింది. ఇదివరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ రంగం రూ. 9,500-10,500 కోట్ల నష్టం ఎదురవ్వొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేసింది. కానీ, ఇది దాదాపు రెట్టింపునకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమాన ప్రమాదం, ఈ నెల ప్రారంభంలో ఇండిగో వేలాది విమానాలను రద్దు చేయడం వంటి అనేక సంక్షోభాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరానికి దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ అంచనాను ఐక్రా 0-3 శాతానికి తగ్గించింది. దీన్ని గతంలో 4-6 శాతంగా అంచనా వేసింది. ఏప్రిల్-నవంబర్ మధ్య ఊహించిన దానికంటే చాలా తక్కువ విమాన ప్రయాణాల రద్దీ ఉందని, ఇందుకు సరిహద్దు ఉద్రిక్తతలు ఎక్కువగా ఉండటమే కారణని ఇక్రా అభిప్రాయపడింది. మరోవైపు ఎక్కువ సంఖ్యలో విమానాల రాకపోకలు అంతరాయం, రద్దు, జూన్‌లో ఎయిర్ఇండియా విమాన ప్రమాం వంటి పరిణామాలు ఎక్కువ ప్రభావితం చేశాయని పేర్కొంది.

Next Story