Credit Card: క్రెడిట్ కార్డు మూసేయాలని అనుకుంటున్నారా.. దీని వల్ల లాభమా...? నష్టమా..?

by Vennela |

Credit Card: క్రెడిట్ కార్డు వల్ల అనేక లాభాలు ఉన్నాయి దాంతోపాటు నష్టాలు కూడా అనే ఉంటాయి.

Credit Card: క్రెడిట్ కార్డు మూసేయాలని అనుకుంటున్నారా.. దీని వల్ల లాభమా...? నష్టమా..?
X

దిశ, వెబ్ డెస్క్: Credit Card: క్రెడిట్ కార్డు వల్ల అనేక లాభాలు ఉన్నాయి దాంతోపాటు నష్టాలు కూడా అనే ఉంటాయి. అయితే క్రెడిట్ కార్డులను సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే, దీని వల్ల అనేక లాభాలు ఉంటాయి అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం క్రెడిట్ కార్డు మనం రెగ్యులర్గా వాడుతూ ఎప్పటికప్పుడు బిల్స్ పే చేస్తూ ఉంటే మీ క్రెడిట్ స్కోర్ బాగా పెరుగుతుంది తద్వారా మీరు భవిష్యత్తులో అనేక రకాల రుణాలు పొందడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

మీరు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తూ ఉంటే మీరు తక్కువ వడ్డీకే లోన్లు పొందే అవకాశం లభిస్తుంది. అలాగే రివార్డు పాయింట్ల రూపంలో మీకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి వీటిని ఉపయోగించుకోండి మీరు పెట్రోల్ షాపింగ్ ట్రావెలింగ్ సమయాల్లో డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డు వల్ల మీరు అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునే ఒక ఫండ్ లాగా ఉపయోగపడుతుంది.

క్రెడిట్ కార్డు వల్ల ఉన్న ప్రధానమైన బెనిఫిట్ ఏమిటంటే ఉదాహరణకు మీ వద్ద రెండు లక్షల రూపాయల క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే అందులో మీరు ఎంత మేర ఖర్చు చేస్తే అంతవరకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది వడ్డీ లేని రుణంగా చెప్పవచ్చు. మీరు సకాలంలో బిల్లులు చెల్లించినట్లయితే మీరు ఎలాంటి వడ్డీ కూడా చెల్లించాల్సిన పనిలేదు. అదే మీరు వ్యక్తిగత రుణాలు తీసుకున్నట్లయితే వడ్డీల రూపంలో ప్రతినెల చెల్లించాల్సి ఉంటుంది.

క్రెడిట్ కార్డు మూసివేయడం వల్ల కలిగే లాభాలు ఇవే:

కొంతమంది క్రెడిట్ కార్డులను దురుపయోగం చేస్తూ ఉంటారు తద్వారా వారి సిబిల్ స్కోర్ భారీగా దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే కొంత కొన్ని సందర్భాల్లో క్రెడిట్ కార్డు భారంగా మారినట్లయితే దానిని మూసి వేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కూడా కొన్ని లాభాలు ఉన్నాయి ముఖ్యంగా లిమిట్ పూర్తిగా వాడేస్తూ ఎప్పటికప్పుడు క్రెడిట్ కార్డును నమ్ముకునే వారు ఉంటారు.

అలాంటి వారు క్రెడిట్ కార్డును మూసేయడం మంచిది ఇలా చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ దెబ్బ తినకుండా కాపాడుకోవచ్చు. ఒకటి కన్నా ఎక్కువ కార్డులు ఉన్నట్లయితే, మీరు వాటిలో కొన్ని కార్డులను మూసివేసి ఉంచడం వల్ల మెయింటెనెన్స్ చార్జీలు తగ్గుతాయి. ఇక చాలావరకు ఒకటి కన్నా ఎక్కువ కార్డులు మెయింటైన్ చేసే వారికి అన్ని కార్డులకు ప్రతి సంవత్సరం వార్షిక ఫీజులను చెల్లిస్తూ ఉండాలి లేకపోతే మీరు ఆ ఫీజులను చెల్లించడం వల్ల మీ డబ్బు వేస్ట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువ కార్డులు ఉన్నప్పుడు డ్యూ డేట్స్ మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో క్రెడిట్ కార్డు మూసి వేయడం మంచిది.

Next Story