mAadhaar vs myAadhaar ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటో తెలుసా?

by Vennela |

mAadhaar vs myAadhaar: నేటికాలంలో ఆధార్ నెంబర్ ఎంత ముఖ్యమో మనకు తెలిసిందే.

mAadhaar vs myAadhaar ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: mAadhaar vs myAadhaar: నేటికాలంలో ఆధార్ నెంబర్ ఎంత ముఖ్యమో మనకు తెలిసిందే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక సేవలు, కేవైసీ ప్రక్రియల్లో ధ్రువీకరణ కోసం ఆధార్ నెంబర్ ను ముఖ్యమైందిగా పరిగణిస్తారు. దీనిని మనం గుర్తింపు అవసరాలకు, చిరునామా రుజువుగా వాడుతుంటారు. ఈ 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కేటాయిస్తుంది. దీనికోసం ప్రజల బయోమెట్రిక్ వివరాలు, స్థానికతకు సంబంధించిన సమాచారాన్ని తీసుకుంటుంది. అయితే ఆధార్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి రెండు కీలకమైన డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది UIDAI. అవి ఏం ఆధార్, మై ఆధార్. కానీ ఈ రెండు రకాల డిజిటల్ వేదికలు అందించే సేవల విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఎం ఆధార్ అంటే ఏంటి?

ఎం ఆధార్ అనేది ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లలో వినియోగించే అధికారిక మొబైల్ యాప్. దీన్ని స్వయంగా UIDAI డెవలప్ చేసింది. ఆధార్ కార్డుతో ఈ యాప్ లోకి వెళ్లి తమ ఆధార్ సమాచారాన్ని డిజిటల్ గా పొందవచ్చు.

మై ఆధార్ అంటే ఏంటి?

మై ఆధార్ అనే పోర్టల్ https://myaadhaar.uidai.gov.in/ అనే వెబ్ సైట్లోకి లాగిన్ అయ్యాక అందులో సేవలను పొందుతాం. ఇందులో ఆధార్ కార్డుకు సంబంధించిన పలు రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి.

మై ఆధార్ తో కలిగే ప్రయోజనాలు:

ఆధార్ కార్డు కలిగిన వాళ్లంతా మై ఆధార్ పోర్టల్ ను వాడుకోవచ్చు. దీని వెబ్ సైట్లోకి వెళ్లి, ఆధార్ సంబంధిత ఆన్ లైన్ సేవలను వెనువెంటనే పొందవచ్చు.దీని కోసం మై ఆధార్ వెబ్ సైట్ హోంపేజీలో సూచికలు ఉంటాయి. ఆధార్ కార్డుకు సంబంధించి ప్రజలు అడిగే ప్రశ్నల విభాగం అందుబాటులో ఉంటుంది.

ఎం ఆధార్ తో ప్రయోజనాలు ఇవే:

ఎం ఆధార్ అనే మొబైల్ యాప్ లోకి వెళ్లి మనం ఆధార్ కార్డును డిజిటల్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డు ఐడీ ఫ్రూఫ్ గా అంతటా చెల్లుబాటు అవుతుంది. ఈ కేవైసీ అవసరమైన సందర్భాల్లో ఎంఆధార్ యాప్ లోని డిజిటల్ ఆధార్ కార్డును మనం కూడా వాడుకోవచ్చు. డిజిటల్ ఆధార్ కార్డు క్యూఆర్ కోడ్ ను ఇతరులకు షేర్ చేసే ఫీచర్ కూడా ఎం ఆధార్ యాప్ లో అందుబాటులో ఉంది.

ఎం ఆధార్ లో ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి?

మొదట మనం ఎం ఆధార్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ను వాడాలంటే మనం ఆధార్ నెంబర్ తో మొబైల్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకుని ఉండాలి. ఈ లింకింగ్ ఉన్నవాళ్లే మై ఆధార్ యాప్ లో ఆధార్ ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకోవచ్చు. ఈయాప్ ను ఓపెన్ చేసిన తర్వాత ప్రధాన డ్యాష్ బోర్డ్ కనిపిస్తుంది. దానిపై రిజిస్టర్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి తర్వాత 4 అంకెల పిన్ లేదా పాస్ వర్డ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరు పిన్ లేదా పాస్ వర్డ్ ను క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ను, కాప్చా కోడ్ ను ఎంటర్ చేయాలి. తర్వాత ఆధార్ తో లింక్ అయిన ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే ఎం ఆధార్ లో ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అవుతుంది.

ఎం ఆధార్ లోని ప్రధాన ఫీచర్లు ఇవే:

1. ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్ల వినియోగదారులకు యాక్సెస్ సులభంగా లభిస్తుంది.

2. ఈ యాప్ లోకి వెళ్లి మన ఆధార్ నెంబర్ కు సంబంధించి అథెంటికేషన్ హిస్టరీని ట్రాక్ చేయాలి.

3. ఈ యాప్ లో బయోమెట్రిక్ లాక్, అన్ లాక్ అనే రెండు ఫీచర్లు ఉంటాయి.

4. ఆధార్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

5. ఆధార్ పీవీసీ కార్డ్ కోసం ఆర్డర్ ఇవ్వచ్చు.

6. ఆధార్ కార్డులోని సమాచారాన్ని అప్ డేట్ చేసే విషయంతో ముడిపడి హిస్టరీని ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేయవచ్చు.

7. ఆధార్ కార్డులో మన చిరునామాను కూడా అప్ డేట్ చేసుకోవచ్చు.

ఎం ఆధార్ యాప్ లో మనం సరైన డాక్యుమెంట్ ను సమర్పించి చిరునామా వివరాలను మార్చుకోవచ్చు. పేరు, పుట్టినతేదీ, ఫోన్ నెంబర్ వంటి వాటిని మనం ఎం ఆధార్ యాప్ లో కానీ, మై ఆధార్ పోర్టల్లో కానీ అప్ డేట్ చేసుకోలేము. ఆధార్ కార్డులోని ఫింగర్ ప్రింట్లు, ఐరిస్, ఫొటోలు, బయోమెట్రిక్ మార్పుకోసం సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి.

Next Story