- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CAIT: రూ. 6 లక్షల కోట్లు దాటిన దీపావళి అమ్మకాలు: సీఏఐటీ
ఇటీవలి జీఎస్టీ సంస్కరణలు, బలమైన వినియోగదారుల సెంటిమెంట్ కారణంగా ఈ స్థాయి వ్యాపారం చూశామని సీఏఐటీ అభిప్రాయపడింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ ఏడాది పండుగ సీజన్‌కు భారీగా రిటైల్ వ్యాపారం జరిగింది. ఒక్క దీపావళి సందర్భంగా దేశంలో రికార్డు స్థాయి రూ. 6.05 లక్షల కోట్ల విలువ అమ్మకాలు జరిగాయని వ్యాపారుల సమాఖ్య కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) మంగళవారం ప్రకటనలో తెలిపింది. ఇందులో రూ. 5.40 లక్షల కోట్లు వస్తువుల అమ్మకాల ద్వారా, రూ. 65,000 కోట్లు సేవల ద్వారా వచ్చాయని పేర్కొంది. ఇటీవలి జీఎస్టీ సంస్కరణలు, బలమైన వినియోగదారుల సెంటిమెంట్ కారణంగా ఈ స్థాయి వ్యాపారం చూశామని సీఏఐటీ అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా 60 ప్రధాన పంపిణీ కేంద్రాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా సీఏఐటీ ఈ లెక్కలను వెల్లడించింది. గతేడాది దీపావళి వేళ రూ. 4.25 లక్షల కోట్ల అమ్మకాలు జరిగాయని సీఏఐటీ వెల్లడించింది. మొత్తం విక్రయాల్లో కిరాణా, ఎఫ్ఎంసీజీ 12 శాతం, బంగారం, ఆభరణాలు 10 శాతం, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వస్తువులు 8 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 7 శాతం, రెడీమేడ్ దుస్తులు 7 శాతం, గిఫ్ట్ ఐటమ్స్ 7 శాతం, హోమ్ డెకార్ 5 శాతం, ఫర్నిషింగ్ అండ్ ఫర్నిచర్ 5 శాతం, స్వీట్స్ అండ్ నమ్కీన్ 5 శాతం, టెక్స్‌టైల్స్, ఫ్యాబ్రిక్స్ 4 శాతం, పూజా వస్తువులు 3 శాతం, పండ్లు, డ్రై ఫ్రూట్స్ 3 శాతం ఉన్నాయి.
ప్యాకేజింగ్, హాస్పిటాలిటీ, క్యాబ్ సర్వీసెస్, ట్రావెల్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, టెంట్ అండ్ డెకరేషన్, మ్యాన్‌పవర్, డెలివరీ వంటి రంగాల నుంచి సేవల రంగం అమ్మకాలకు రూ.65,000 కోట్లు వచ్చాయని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీ సీ భార్టియా అన్నారు. 72 శాతం మంది వ్యాపారులు రోజువారీ వినియోగ వస్తువులు, పాదరక్షలు, దుస్తులు, మిఠాయి, గృహాలంకరణ, కన్స్యూమర్ డ్యూరబుల్స్‌పై జీఎస్టీ రేట్లు తగ్గించడం వల్లే అమ్మకాల రికార్డు స్థాయిలో పెరిగాయని చెప్పారు. సీఏఐటీ ప్రకారం, ఈ ఏడాది దీపావళికి వాణిజ్యం లాజిస్టిక్స్, ప్యాకేజింగ్, రవాణా, రిటైల్ రంగాల్లో 50 లక్షల తాత్కాలిక ఉద్యోగాల సృష్టి జరిగింది. అలాగే, గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలు మొత్తం వాణిజ్యంలో 28 శాతం వాటా కలిగి ఉండటంతో, ఇవి మెట్రోల కంటే ఎక్కువ ఆర్థిక భాగస్వామ్యాన్ని అందించాయని సీఏఐటీ పేర్కొంది.






