దీపావళి ఆఫర్లు...ఒక్కో కారుపై రూ.35 వేల నుంచి త‌గ్గింపు

by velandi.Saikiran |   (  Updated:2025-10-12 08:31:27  IST  )

దీపావళి పండుగ వచ్చేస్తోంది. ఈ పండుగకు వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి నేపథ్యంలో మార్కెట్లో అనేక రకాల ఆఫర్లు

దీపావళి ఆఫర్లు...ఒక్కో కారుపై రూ.35 వేల నుంచి త‌గ్గింపు
X

దిశ‌, వెబ్ డెస్ : దీపావళి పండుగ వచ్చేస్తోంది. ఈ పండుగకు వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి నేపథ్యంలో మార్కెట్లో అనేక రకాల ఆఫర్లు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వస్తువులతో పాటు కార్లపై కూడా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి కంపెనీలు. అయితే తాజాగా టాటా, మ‌హీంద్ర‌, మారుతి సుజుకీ కార్లపై కూడా దీపావళి ఆఫర్లు ప్రకటించారు. అక్టోబర్ 21వ తేదీ వరకు ఈ ఆఫర్లు కొనసాగనున్నట్టు కంపెనీలు వెల్లడించాయి. అక్టోబర్ 21వ తేదీ వరకు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు అలాగే లయాల్టీ బోనస్ లు ఉంటాయని టాటా మోటార్స్ తాజాగా వెల్లడించింది.

ఇందులో భాగంగానే టాటా టియాగో కారుపై 20 వేల నుంచి 30 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. నెక్సాన్ పై 35వేల రూపాయలు అలాగే టాటా పంచ్ పై 25 వేల డిస్కౌంట్ ఇస్తున్నారు. మారుతి సుజుకి కార్లపై కూడా డిస్కౌంట్ లో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా వ్యాగనార్ (Wagon R), బ్రీజ్జాపై 75 వేల రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. బలేనో కారుపై లక్ష వరకు డిస్కౌంట్ ఉంది. మహీంద్రా ఎస్ యూవీ విభాగంలో కూడా కొన్ని ఆఫర్లు ఉన్నాయి. ఇందులో మరాజ్జో మోడల్ పై ఏకంగా మూడు లక్షల డిస్కౌంట్ ఇస్తున్నారు. థార్, XUV 400 , బొలెరో మోడల్స్ పై 90 వేల నుంచి 2.50 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి.

Next Story