- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ashwini Vaishnaw: ఆన్‌లైన్ కంటెంట్, పిల్లల భద్రతకు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లదే బాధ్యత
ఇంటర్నెట్ స్వభావం ఇప్పుడు మారిపోయింది, ఏఐ-జనరేటెడ్ కంటెంట్ వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు తాము హోస్ట్ చేసే కంటెంట్‌కు బాధ్యత వహించాలని, పిల్లలు, పౌరుల ఆన్‌లైన్ భద్రతకు జవాబుదారీ వారిదేనని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. గురువారం జరిగిన డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్(డీఎన్‌పీఏ) కాన్‌క్లేవ్‌లో మాట్లాడిన ఆయన.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగానికి సంబంధించి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏ ఒక్క యూజర్ అనుమతి లేకుండా వారి వాయిస్, ఫేస్, పర్సనాలిటీని వాడుకోవడానికి వీల్లేదు. ఇంటర్నెట్ స్వభావం ఇప్పుడు మారిపోయింది, ఏఐ-జనరేటెడ్ కంటెంట్ వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. వేల సంవత్సరాలుగా నిర్మించిన సంస్థలపై నమ్మకాన్ని బలోపేతం చేయడంలోని ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలి. నమ్మకంపైనే ఈ సమాజం ఏర్పడింది. కుటుంబం, న్యాయవ్యవస్థ, మీడియా, శాసనవ్యవస్థలు కూడా దీనిపై ఆధారపడే కొనసాగుతున్నాయి. మీడియా ఎల్లప్పుడు ధృవీకరించిన సమాచారాన్నే పబ్లిష్ చేస్తోంది, ఆ కంటెంట్‌కు బాధ్యత వహిస్తోందన్నారు. ఇదే తరహాలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు కూడా బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో డీప్‌ఫేక్ కారణంగా డిజిటల్ వినియోగంపై సందేహాలు నెలకొన్నాయి. లేని విషయాలను కూడా జరిగినట్టు వీడియోలు పుట్టుకొస్తున్నాయి. వాటిని చాలామంది ప్రజలు నమ్ముతున్నారు. ఎప్పుడూ జరగని సంఘటనలను ప్రజలు నమ్మే స్థాయిలో ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.






