- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Zero Interest: జీరో ఇంట్రెస్ట్‌తో పర్సనల్ లోన్ పొందవచ్చని మీకు తెలుసా? పూర్తి వివరాలివే..!!
Zero Interest: డబ్బు అవసరం ఏ సమయంలో ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు.

దిశ, వెబ్ డెస్క్: Zero Interest: డబ్బు అవసరం ఏ సమయంలో ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. ఆర్థిక అత్యవసరాలను తీర్చుకునేందుకు చాలా మంది ఇటీవలి కాలంలో పర్సనల్ లోన్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ పర్సనల్ లోన్స్ లో ఉండే అధిక వడ్డీ రేట్లు.. మరింత ఆర్థిక భారాన్ని మోపుతాయి. అయితే అసలు ఎలాంటి వడ్డీ లేకుండా కూడా పర్సనల్ లోన్స్ తీసుకోవచ్చన్న సంగతి మీకు తెలుసా. జీరో వడ్డీతో లోన్ తీసుకోవచ్చు. పూర్తి వివరాలు చూద్దాం.
ఈ వడ్డీలేని పర్సనల్లోన్ ను సున్నా వడ్డీలోన్స్ అని కూడా అంటారు. మీరు తీసుకున్న అప్పును తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. ఆర్థిక సమాయం అవసరమైన వారికి, ఈ లోన్స్ మంచి ఆప్షన్ గా కనిపిస్తాయి. రెగ్యులర్ లోన్స్ లో ఉండే వడ్డీల భారం దీనిలో ఉండదు. ఈ పర్సనల్ లోన్ అనేది లెండర్ ను బట్టి మారుతుంది.
-మీరు సకాలంలో చెల్లించడంలో విఫలం అయినట్లయితే మీ క్రెడిట్ స్కోర్ పెరిగిపోతుంది. ఆర్థిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇది మీ విశ్వసనీయతను, భవిష్యత్తులో లోన్ తీసుకునే అవకాశాన్ని తగ్గిస్తుంది.
- వడ్డీ లేని పర్సనల్ లోన్ తో పరిమిత ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే సాధారణంగా ఈ రుణాలు నిర్దిష్ట వస్తువులు లేదా సేవలకు అనుసంధానించి ఉంటాయి. కొన్నింటికి వడ్డీలేని లోన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం చాలా షరతులను పెడుతుంది.
వడ్డీలేని వ్యక్తిగత లోన్ తీసుకోవాలంటే 21 నుంచి 65ఏళ్ల వయస్సువారై ఉండాలి. పాన్ కార్డ్, ఆధార్ కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన మరేదైనా గుర్తింపును రుజువును అందించాలి. వడ్డీలేని పర్సనల్ లోన్ కు అర్హత సాధించడానికి మీరు అధిక క్రెడిట్ స్కోరు ఉండాలి. తరుచుగా 700-900 మధ్య ఉండాలి. రుణదాతలు వడ్డీ రేటును వసూలు చేయకుండా రిస్క్ తీసుకుంటున్నారు. కాబట్టి దరఖాస్తుదారులు తరచుగా అధిక క్రెడిట్ ప్రొఫైల్ కలిగి ఉండాలని కోరుకుంటారు.
వడ్డీలేని పర్సనల్ లోన్ ఒకేసారి ఖర్చు చేయానికి మంచి పరిష్కారంగా అనిపించినప్పటికీ నిబంధనలను పూర్తిగా చదవాలి. కొన్ని సంస్థలు, మతపరమైన లేదా స్వచ్చంద సంస్థలు తమ సమాజాలకు సమాయం చేయడానికి నిజంగా వడ్డీ లేని లోన్స్ అందించవచ్చు. అయినా ఇతరులు పరిమితులు లేదా అధిక ఖర్చులు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఇవి ప్రయోజనాలను అధిగమించడానికి కారణమవుతాయి.






