- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Diamonds: వెండి వద్దు.. బంగారం వద్దు.. డైమండ్ ముద్దు.. మారుతున్న ట్రేండ్
Diamonds: తగ్గిన ధరలు ఎక్కువకాలం నిలిచే అవకాశాలు లేకపోవడంతో, డైమండ్ కొనాలని భావించే వారికి ఇదే బంగారు అవకాశం

దిశ, వెబ్‌డెస్క్: Diamonds: తగ్గిన ధరలు ఎక్కువకాలం నిలిచే అవకాశాలు లేకపోవడంతో, డైమండ్ కొనాలని భావించే వారికి ఇదే బంగారు అవకాశం! ఇక భారత్‌లో సూరత్ నగరం డైమండ్ల కటింగ్, పాలిషింగ్‌కు ప్రపంచ హబ్‌గా ఉంది.
ఒకప్పుడు డైమండ్ నగలు ఖరీదైనవని భావించి దూరంగా ఉండేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. డైమండ్ల ధరలు గణనీయంగా తగ్గి, అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. గత కొంతకాలంగా బంగారం, వెండి ధరలు పెరుగుతుంటే, డైమండ్ల రేట్లు మాత్రం పడిపోతున్నాయి. 2022లో క్యారెట్ డైమండ్ ధర 5 లక్షలు ఉంటే, ప్రస్తుతం 3.5 లక్షలకు చేరుకుంది. అంటే దాదాపు 30% తగ్గుదల. ఇక ప్రపంచ మార్కెట్‌లో డైమండ్ల డిమాండ్ తగ్గడం దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా ల్యాబ్-గ్రోన్ డైమండ్లు విస్తృతంగా అందుబాటులోకి రావడం సహజ డైమండ్ల మార్కెట్‌ను ప్రభావితం చేస్తోంది. పైగా, చైనా లాంటి ప్రధాన దేశాలు భారతీయ డైమండ్ల కొనుగోళ్లు తగ్గించడంతో దేశీయంగా రేట్లు మరింత దిగివచ్చాయి.
బంగారం ప్రధానంగా వాడే ఇండియాలో ఇప్పుడు డైమండ్ నగలపై ఆసక్తి పెరుగుతోంది. ప్రత్యేకించి సౌతిండియాలో డైమండ్లకు డిమాండ్ ఎక్కువైందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తక్కువ బరువు, అధిక మన్నిక, ఆకర్షణీయమైన కొత్త డిజైన్లు – ఇవన్నీ డైమండ్లను మరింత ప్రజాదరణ పొందేలా చేస్తున్నాయి. ఇప్పటి వరకు డైమండ్ నగలు వీఐపీలకే పరిమితమని భావించేవారు. కానీ, ఇప్పుడు తక్కువ బడ్జెట్‌లోనే అందుబాటులోకి వస్తుండటంతో, సాధారణంగా బంగారంపై ఎక్కువ ఆసక్తి కలిగినవారు కూడా డైమండ్ల వైపు మొగ్గు చూపిస్తున్నారు. అయితే, ఈ తక్కువ రేట్లు ఎంత కాలం ఉంటాయో చెప్పలేం. మార్కెట్ ఎప్పుడైనా తిరిగి మారవచ్చు. అందుకే, డైమండ్ కొనాలని చాలా కాలంగా ఆలోచిస్తున్నవారికి ఇది చక్కని అవకాశం.
అద్భుతమైన ప్రకృతి వరం:
డైమండ్లు భూమిలో 150-200 కిలోమీటర్ల లోతులో, అత్యంత అధిక ఉష్ణోగ్రతలు, ఒత్తిడిలో ఏర్పడతాయి. కోట్లు సంవత్సరాల పాటు కార్బన్ అణువులు ఒత్తిడికి లోనై గట్టి పరమైన రత్నంగా మారతాయి. అగ్నిపర్వతాల పేలుళ్ల ద్వారా ఇవి భూమి ఉపరితలానికి వస్తాయి. అందుకే, డైమండ్లు అరుదైనవిగా, విలువైనవిగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా రష్యా, బోట్స్‌వానా, కెనడా, ఆఫ్రికా దేశాలు ప్రధాన ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. భారత్‌లో సూరత్ నగరం డైమండ్ల కటింగ్, పాలిషింగ్‌కు ప్రపంచ హబ్‌గా ఉంది.






