- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IndiGo: ఇండిగో విమానాల రద్దుపై డీజీసీఏ దర్యాప్తు
విమానాల రద్దు, ఆలస్యాన్ని తగ్గించేందుకు తీసుకున్న ప్రణాళికలు, చర్యలపై వివరణ ఇవ్వాలని కోరింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో విమానాల రద్దు, ఆలస్యంపై నియంత్రణ సంస్థ డీజీసీఏ బుధవారం దర్యాప్తును ప్రారంభించింది. ప్రస్తుత పరిస్థితికి కారణాలు, విమానాల రద్దు, ఆలస్యాన్ని తగ్గించేందుకు తీసుకున్న ప్రణాళికలు, చర్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. డీజీసీఏ ఎప్పటికప్పుడు పరిస్థితులు, పరిణామాలను పరిశీలిస్తోందని, ప్రయాణీకులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు విమానాల రద్దు, ఆలస్యాన్ని తగ్గించేందుకు ఇండిగోతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇటీవల ఇండిగో ఇచ్చిన పనితీరుపై సమాచారం ప్రస్తావించిన డీజీసీఏ, నవంబర్‌లో మొత్తం 1,232 విమానాలను రద్దు చేసింది. వీటిలో సిబ్బంది, కొత్త ఎఫ్‌డీటీఎల్ నిబంధనల పరిమితుల కారణంగా 755 విమానాలు ఉన్నాయని తెలిపింది. అలాగే, విమానాశ్రయాల పరిమితుల కారణంగా 258, ఎయిర్ ట్రాఫి కంట్రోల్ వ్యవస్థ వైఫల్యం కారణంగా 92 విమానాలు, ఇతర కారణాలతో మరో 127 విమానాలు రద్దు అయ్యాయని ఇండిగో వివరించినట్టు డీజీసీఏ వెల్లడించింది. కాగా, దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా ఉన్న ఇండిగో బుధవారం ఒక్కరోజే వివిధ ఎయిర్‌పోర్టులలో 100కి పైగా విమానాలను, రెండు రోజుల వ్యవధిలో 300కి పైగా విమానాలను రద్దు చేసింది. సిబ్బంది కొరత కారణంగా కొన్ని విమానాలను ఆలస్యంగా నడుపుతున్నట్టు, అనేక సేవల్లో అంతరాయం ఏర్పడిందని, కార్యకలాపాలను మరో 48 గంటల్లో సరిదిద్దనున్నట్టు ప్రకటించింది.






